Elections 2024 Final Results: పూర్తయిన కౌంటింగ్.. ఫైనల్ లెక్కలు ఇవే!
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణ లోక్ సభ, దేశ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ, తెలంగాణ లోక్ సభ, దేశ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి మెజార్టీ సీట్లు సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 'సబ్కా సాత్ సబ్కా వికాస్' అనే మంత్రం గెలిచిందని పేర్కొన్నారు. మూడోసారి ఎన్డీయే కూటమి అధికారం చేపట్టబోతోందని స్పష్టం చేశారు.
ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు.
వరుసగా మూడోసారి ఎన్డీఏపై విశ్వాసం ఉంచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టం అన్నారు. 'మీ అభిమానానికి నేను జనతా జనార్దన్‌కి నమస్కరిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.
ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అద్భుత విజయాలు నమోదు చేయడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు, టీడీపీ అఖండ విజయాన్ని సొంతం చేసుకోవడంతో శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్యూహ్యంగా పుంజుకుంది. గత ఎన్నికల్లో 4ఎంపీ సీట్లు గెలుచుకోగా ఈ సారి 8 సీట్లు దక్కించుకుంది. బీజేపీ విజయానికి కారణాలేంటి? బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చాయా? తెలంగాణ ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారా? తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్డీయే 295 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమికి 231 సీట్లలో మెజీర్టీతో దూసుకుపోతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ మంతనాలు జరుపుతోంది.
బీఆర్ఎస్ కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా అవకాశం ఇవ్వకపోవడానికి కారణలేంటి? అసెంబ్లీలాగే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశారా? అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.