Manipur: మణిపూర్ హింసకాండలో వాళ్ల ప్రమేయమే ఉందా: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్..
మణిపూర్ అల్లర్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్లో ఎన్నో ఏళ్ల నుంచి మెయిటీలు, కుకీలు కలిసి ఉంటున్నారని.. ఒక్కసారిగా హింస ఎలా చెలరేగిందని ప్రశ్నించారు. వాస్తవానికి అక్కడ హింస జరగలేదని.. జరిగేలా చేయిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందులో విదేశీ శక్తుల పాత్ర ఏమైనా ఉందా.. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు విదేశీ శక్తులకే మేలు చేస్తాయని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లను రాబట్టుకునే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.