Srilanka: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి శ్రీలంకకు వెళ్లాలంటే వీసా అవసరం లేదు..
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియాతో సహా ఏడు దేశాలకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వనుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని చెప్పారు.