నోట్లోకి గాలి ఊది పామును కాపాడిన కానిస్టేబుల్..!
మనుషులకే కాదు పాములకు కూడా సీపీఆర్ ద్వారా ప్రాణం పోయొచ్చని మధ్యప్రదేశ్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ చెబుతున్నారు. వాటి నోట్లో గాలి ఊదడం ద్వారా చనిపోయాయనుకున్న చాలా పాములను తాను కాపాడానని తెలిపారు. తాజాగా ఓ పాముకు ఆయన సీపీఆర్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.