Assembly Elections:ఛత్తీస్‌ఘడ్, మిజోరంలలో మొదలైన పోలింగ్
ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది.
ఛత్తీస్ ఘడ్, మిజోరం లలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఛత్తీస్ ఘడ్ లో మొదటి విడత 20 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మిజోరంలో 40 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 నుంచి పోలింగ్ మొదలయ్యింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మీద భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్ లో మాట్లాడారు. ద్విదేశ పరిష్కారాన్ని పునరుద్ఘాటించారు.
కాలుష్య స్థాయి పెరగడంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. వాహనాలకు సరి-బేసి సంఖ్య విధానాన్ని మరోసారి అమలు చేయనున్నారు.
బెంగళూరులో దారుణ హత్యకు గురైన ప్రతిమ అనే అధికారిణిని ఆమె కారు మాజీ డ్రైవరే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
వాయుకాలుష్యం క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలడం ఆందోళన కలగిస్తోంది. ఇప్పటికే ఉన్న పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వాయుకాలుష్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఉత్తరఖాండ్‌లోని కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదారేశ్వరుడ్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడ 'ఛాయ్ సేవ'లో పాల్గొని భక్తులకు ఆయన 'టీ' అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వాయు కాలుష్యం పై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఈరోజు కొంచెం తగ్గింది
ప్రపంచంలో ఇప్పుడు అందరి నోళ్ళల్లో నానుతున్న పేరు విరాట్ కోహ్లీ. నిన్న సౌతాఫ్రికా మ్యాచ్‌లో సచిన్ సెంచరీల రికార్డ్ ను బద్దలు కొట్టి గొప్ప క్రికెటర్ గా నిలిచాడు. దీని మీద భావోద్వేగంతో స్పందించిన విరాట్...ఏం చేసినా తాను సచిన్ అంత గొప్ప ఆటగాడిని మాత్రం కాదంటున్నాడు.