PM Modi: ప్రధాని మోదీ పర్యటనలో సెక్యూరిటీ లోపం.. ఎస్పీపై వేటు..
రెండేళ్లక్రితం ప్రధానిమోదీ పంజాబ్‌లో పర్యటించినప్పుడు భద్రతా వైఫల్యం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో ఫిరోజ్పుర్లో ఎస్పీగా ఉన్న గుర్బిందర్ సింగ్‌పై 23 నెలల తర్వాత వేటు పడింది. ఆయనను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేస్తూ పంజాబ్ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.