TVS Company : మిచౌంగ్ తుఫాను బాధితులకు అండగా టీవీఎస్ కంపెనీ..
మిచౌంగ్ తుఫాను ప్రభావానికి తమిళనాడులోని చెన్నైతో పాటు పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో వారికి సాయం చేసేందుకు ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ ముందుకొచ్చింది. సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.3 కోట్లు విరాళం అందించింది.