Loksabha today:మూడు న్యాయసంహిత బిల్లులకు లోక్ సభలో ఆమోదం
పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయసంహిత బిల్లులకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది.
పాత చట్టాలు పోయి కొత్త చట్టాలు వస్తున్నాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ ఈ మూడింటి స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయసంహిత బిల్లులకు ఈరోజు లోక్ సభ ఆమోదం తెలిపింది.
నటి కంగనా రనౌత్ రాజకీయ ప్రవేశంపై ఆమె తండ్రి అమర్ దీప్ క్లారిటీ ఇచ్చారు. కంగన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తుంది. ఏ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనేది బీజేపీ హైకమాండ్ త్వరలో నిర్ణయిస్తుందని తెలిపారు.
మీడియా తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 150 మంది ఎంపీలను బయటకు పంపిస్తే మీడియాలో కనీసం చర్చ లేదన్నారు. ఉపరాష్ట్రపతిని ఎవరూ ఎమీ అనలేదని క్లారిటీ ఇచ్చారు రాహుల్. ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని మీడియాకు సూచించారు రాహుల్.
దక్షిణాది ప్రతినిధులతో జరిగిన కూటమి సమావేశంలో బీహార్ సీఎం నితీశ్ సహనం కోల్పోయారు. ఆయన ప్రసంగానికి అనువాదం కావాలని డీఎంకే నేతలు కోరడంతో ఆయనకు కోపం వచ్చింది. హిందీ జాతీయ భాష అంటూ ఫైర్ అయ్యారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం దేశానికి జాతీయ భాష లేదు.
పార్లమెంట్ లో ఇంకా ఎంపీల సస్పెన్షన్ వేటు కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి 139 మంది ఎంపీలు సస్పెండ్ అవ్వగా..తాజాగా మరో ఇద్దరు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 141 కి చేరింది.
మార్నింగ్ టీ ఆసల్యంగా ఇచ్చిందని గొడవపడి భార్యను కత్తితో పొడిచి చంపిన భయంకరమైన సంఘటన ఘజియాబాద్ లో జరిగింది. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్ తన భార్య సుందరి మెడ కోసేయగా అక్కడికక్కడే మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో అతన్ని అరెస్టు చేశారు.
టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ఉపరాష్ట్రపతి ధన్ కర్ ప్రవర్తన శైలిని అనుకరించిన వివాదంపై ప్రధాని మోడీ స్పందించారు. నేను 20 ఏళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. అయితే వాటన్నింటినీ ఛాలెంజ్ గా తీసుకుని ముందుకు వెళ్తున్నా. ధన్ కర్ ను బాడీ షేమింగ్ చేయడం బాధకరమన్నారు.
భారతదేశ అపరకుబేరులు అంబానీ, అదానీలను పక్కన పెట్టేసిందో మహిళ. వాళ్ళది కాదు ఈ ఏడాది సంపాదన నాదే ఎక్కువ అంటున్నారు పారిశ్రామిక వేత్త సావిత్రి జిందాల్. ప్రస్తుతం ఈవిడ సంపద విలువ 25.3 బిలియన్ డాలర్లు.
అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సీనియర్ నేతలు అయినటువంటి ఎల్ కే అద్వానీ, జోషిలను ఆలయ ట్రస్ట్ రావొద్దని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. దీంతో నేడు విశ్వ హిందూ పరిషత్ వారు వారిద్దరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు.