Zomato Job:
గురుగ్రామ్‌లోని చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్‌లో ఆఫీసర్ గురించి జొమాటో సీఈవో దీపిందర్ ఉద్యోగుస్తులను ఆహ్వానించారు. దీనికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అయితే ఒక చిన్న మెలిక పెట్టారు. ఎంపికైన వారికి తొలి ఏడాది ఎలాంటి వేతనమూ చెల్లించకపోగా.. సదరు అభ్యర్థే తిరిగి ₹20 లక్షలు చెల్లించాలన్న షరతు విధించారు. దాంతో పాటూ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలను ప్రకటించారు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన, జీవితంలో ఎదగాలన్న దృఢ సంకల్పం ఉన్న వారు మాత్రమే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. దీనికి పూర్వానుభవంతో పెద్దగా పనిలేదన్నారు. కొత్తగా ఆలోచించే వారు ఈ ఉద్యోగానికి తప్పకుండా ఆప్లై చేసుకోవాలని చెప్పారు.
చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ ఉద్యోగానికి ఎంపికైన వారు జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల కోసం పని చేయాల్సి ఉంటుందని సీఈవో దీపిందర్ చెప్పారు. ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి తొలి ఏడాది ఎలాంటి చెల్లింపులూ చేయబోమన్నారు. పైగా సదరు అభ్యర్థే రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు డొనేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగి కోరితే జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళంగా ఇస్తుందన్నారు.
Also Read: CBSE: 10,12 పరీక్షల తేదీని ప్రకటించిన సీబీఎస్‌ఈ బోర్డు