Office and Work From Home:
ఒకప్పుడు ఇంటి దగ్గర నుంచి పని అన్న కాన్సెప్టే లేదు. అందరూ ఆఫీసుకెళ్ళే పని చేసేవారు.కానీ కరోనా మొత్తం ప్రపంచాన్ని మార్చేసింది. పని చేసే తీరు అటుఇటు అయిపోయింది. కోవిడ్ టైమ్ నుంచి ఆఫీసుకెళి పని చేసేవారు తక్కువ...ఇంటి నుంచి పని చేసేవారు ఎక్కువ అయిపోయారు. కంపెనీలు ఆఫీసుకు వచ్చి పని చేయండి గగ్గోలు పెడుతున్నా ఉద్యోగులు వినడం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే ఉద్యోగాలు మానేస్తామని కూడా చెబుతున్నారు. చాలా కంపెనీల్లో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేశారు కూడా.
ఇది కూడా చూడండి: Cyclone Dana: తీవ్రంగా దానా తుఫాను..ముందస్తు చర్యతో సంసిద్ధమైన ఒడిశా
ఆఫీసే సేఫ్..
అయితే ఇంటి కంటే ఆఫీస్ భద్రమని చెబుతున్నాయి సర్వేలు. అనేక రకాలుగా...చాలా మంది మీద నిర్వహించిన ఈ సర్వేల్లో ఆఫీస్ నుంచి పని చేస్తేనే మనుషుల్లో మానసిక ఆరోగ్యం ఉంటుందని తేలింది. మొత్తం తొమ్మిది కోణాల్లో ఈ విషయాన్ని పరిశీలించారు. ఇంటి నుంచి పని చేసేవారిలో సమతుల్యత దెబ్బ తింటోందని చెబుతున్నారు. ఆఫీస్ నుంచి పని చేస్తే నిర్దేశిత సమయంలోనే చేస్తున్నారు. కానీ ఇంటి నుంచి పని చేసేవారు ఎక్కువ పనిచేస్తున్నారు. అసలు చేయాల్సిన ఎనిమిది, తొమ్మది గంల కంటే ఎక్కువ పని చేస్తున్నారు. కంపెనీలు కూడా ఇంటి నుంచి అయితే ఎక్కువ వర్క ఆశిస్తున్నాయి. దీని వలన ఉద్యోగులపై తెలియకుండానే స్ట్రెస్ పడుతోంది. ఆఫీస్ కు వెళితే టైమ్ వేస్ట్, ట్రాఫిక్ సమస్యలు అని ఆలోచిస్తున్నారు కానీ ఇంటి నుంచి ఎక్కువ పని చేస్తున్నారని మర్చిపోతున్నారు.
ఇది కూడా చూడండి:Blink it: బ్లింకిట్‌లో ఈఎంఐ ఆప్షన్..కొన్ని కొనుగోళ్ళకు మాత్రమే
ఇతరులతో ఇంట్రాక్షన్...
ఇంటి నుంచి పని చేసే వారికన్నా ఆఫీసు నుంచి పని చేసేవారు ఎక్కువగా సామాజిక సంబంధాలను కలిగి ఉంటున్నారు. ఆఫీస్ కెళ్ళే వారు నలుగురితో కలుస్తున్నారు. తింటున్నారు, తిరుగుతున్నారు. కానీ ఇంటి నుంచి పని చేసేవారికి ఇల్లే జీవితం అయిపోతోంది. తాను, తన ఇంట్లో వారు తప్పితే ఎవరితోనే కలవడం లేదు. దీని వలన ఉద్యోగులు ఒంటరి జీవులుగా మిగిలిపోతున్నారు. మానవత్వం, మానవ సంబంధాలను మర్చిపోయి వస్తువుల్లా మిగిలిపోతున్నారని అధ్యయనంలో తేలింది. ఇది కూడా మనుషుల మీద చాలా ప్రభావం చూపిస్తోంది.
ఒక్కో దేశంలో ఒక్కోలా...
అయితే ఈ అధ్యయనాల రిజల్ట్స్ ఒక్కో దేశానికి ఒక్కోలా వచ్చాయి. భారతదేశంలో ఆఫీసుకెళ్ళి పని చేయడమే ఉత్తమం అని తేలితే.. యూఎస్, యూకేల్లో మాత్రం ఇంటి నుంచి పని చేసినవారే ఎక్కువ మానసిక ఆరోగ్యం కలిగి ఉన్నారని తెలిసింది. వర్క్ కల్చర్ & మెంటల్ వెల్‌బీయింగ్ అనే అధ్యయనం US-ఆధారిత మైండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, సేపియన్స్ ల్యాబ్స్ ద్వారా నిర్వహించారు. ఇందులో 65 దేశాలలో 54,831 మంది ఉద్యోగ, ఇంటర్నెట్-ఆధారిత ఉద్యోగులను పరీక్షించారు. భారతదేశంలో రీసెంట్‌గా చనిపోయిన పూనె సీఏ ఉద్యోగి మరణాన్ని దృష్టిలో పెట్టుకుని సర్వే నిర్వహించారు. పూనె ఉద్యోగి మరణానికి కారణం...వర్క్, స్ట్రెస్, ఎవరి స్వార్ధం వారే చూసుకోవడం లాంటివని ఇప్పటికే నిరూపించబడింది. దీనికి ఒక రకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా కారణం అంటున్నాయి అధ్యయనాలు. ఇంటి నుంచి పని చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెబుతున్నాయి. ఆఫీస్ కు వెళ్ళడం వలన ఒకరితో ఒకరి మెరుగైన సంబంధాలు ఏర్పడతాయని...మనుషుల మధ్య ఇది చాలా ముఖ్యమని చెబుతున్నారు. మానసిక ఆరోగ్యానికి ఇలాంటివి ఎంతో ముఖ్యమని అంటున్నారు.
Also Read: Maharashtra: కాంగ్రెస్‌కు ఎంఐఎం షాక్..మహారాష్ట్రలో పోటీకి సిద్ధం