Giriraj Singh : నెక్ట్స్ నువ్వే.. సీఎం మమతా బెనర్జీకి కేంద్రమంత్రి వార్నింగ్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 174 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు కొనసాగుతోన్నారు. 66 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

New Update
singh

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 174 స్థానాల్లో ఆధిక్యంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు కొనసాగుతోన్నారు. 66 స్థానాల్లో మహాగఠ్‌బంధన్‌ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ ఫలితాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేదు ప్రశాంత్ కిశోర్‌ జన్‌సురాజ్‌ పార్టీ. దీంతో భారీ మెజార్టీతో  ఎన్డీయే కూటమి మరోసారి బీహార్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.  ఈ  క్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. 

ఇది అభివృద్ధి విజయం

బీహార్ ప్రజలు అభివృద్ధి, సుపరిపాలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని మరోసారి చాటుకున్నారని గిరిరాజ్ సింగ్ అన్నారు. బీహార్‌లో అరాచక ప్రభుత్వం ఏర్పాటు కాదని ముందే చెప్పాం. బీహార్ యువత చాలా తెలివైనవారు. ఇది అభివృద్ధి విజయం. మేము బీహార్‌ను గెలిచాం. ఇక తదుపరి వెస్ట్ బెంగాల్ వంతు అని మంత్రి వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో కూడా బీజేపీ అధికారంలోకి రావడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. దీంతో పరోక్షంగా ఆయన ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీకి హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. 

మరోవైపు, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్ (MGB) కూటమి ఈ ఎన్నికల్లో గణనీయమైన ఎదురుదెబ్బ తగిలింది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ (RJD) చెప్పుకోదగిన స్థాయిలో సీట్లు సాధించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలహీనమైన ప్రదర్శన కూటమి ఓటమికి ప్రధాన కారణమైంది. ఆర్జేడీ సింగిల్-లార్జెస్ట్ పార్టీ హోదాను కోల్పోనుంది. 2020 లో ఆ పార్టీ 75 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ వరుసగా ఐదవసారి తన పదవిని నిలుపుకుంటారా లేదా అనేది ఈరోజు వెలువడే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయి.

Advertisment
తాజా కథనాలు