Maithili Thakur : బీహార్ అసెంబ్లీకి ఎన్నికల్లో ఫోక్ సింగర్!.. ఎవరీ మైథిలి ఠాకూర్‌ ?

బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సారి రెండ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్, నవంబర్ 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది.

New Update
bihar

బీహార్ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సారి రెండ విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6వ తేదీన మొదటి విడత పోలింగ్, నవంబర్ 11వ తేదీన రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్‌లో మొత్తం 243 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుత బీహార్ శాసనసభ గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు అలెర్ట్ అయ్యాయి. 

బీజేపీ నుంచి పోటీ చేస్తా

అయితే ఈ ఎన్నికల్లో జానపద గాయని మైథిలి ఠాకూర్‌ కూడా బీజేపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. వీటిపై తాజాగా ఆమె స్పందించారు.  తనకు టికెట్‌ ఇచ్చి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తే కచ్చితంగా పరిశీలిస్తానన్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రస్తుతం తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. టికెట్‌ ఇచ్చే విషయం ఇంకా ఖరారు కాలేదన్నారు. నా సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను... ఒకవేళ నాకు టికెట్ ఇస్తే నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఆ ప్రాంతంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది" అని అన్నారు.  

బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలపై స్పందిస్తూ, ఇటీవల బీహార్ పర్యటన సందర్భంగా నిత్యానంద్ రాయ్ , వినోద్ తవ్డేలను కలిసి రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించానని  ఠాకూర్ స్పష్టం చేశారు.  ఠాకూర్ బీహార్ ఎన్నికల్లో దర్భంగాలోని అలీనగర్ స్థానం నుండి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. కాగా మైథిలి ఠాకూర్‌ను ఎన్నికల సంఘం బీహార్ 'స్టేట్ ఐకాన్'గా నియమించింది. భారతీయ శాస్త్రీయ, జానపద సంగీతంలో శిక్షణ పొందిన ఠాకూర్, బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకున్నారు.

 బీహార్‌లోని మధుబని జిల్లాలో జన్మించిన మైథిలి, తన ఇద్దరు సోదరులతో కలిసి, వారి తాత, తండ్రి వద్ద జానపద, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, హార్మోనియం, తబలాలో శిక్షణ పొందారు. మైథిలి, భోజ్‌పురి, హిందీ భాషలలో బీహార్ సాంప్రదాయ జానపద పాటలను పాడారు. ఇక, గతంలో ఈమె ప్రధాని నరేంద్రమోదీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శబరిని ఉద్దేశిస్తూ మైథిలి పాడిన పాటకుగాను ప్రధాని ఆమెను అభినందించారు.

Advertisment
తాజా కథనాలు