/rtv/media/media_files/2025/05/07/zJXln5NoCKGsQUhMpjmX.jpg)
Colonel Sophia Qureshi
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ ఉగ్రవాదులపై ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకుంది. మే 7వ తేదీ బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. దీనిలో చాలా మంది ఉగ్రవాదులు మరణించారు. భారత్ ఈ చర్యకు ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టింది. ఆపరేషన్ సిందూర్ గురించి భారత సైన్యం ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్‌లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఇందులో ఒకరి పేరు సోఫియా ఖురేషి, మరొకరి పేరు వ్యోమికా సింగ్. సోఫియా ఖురేషి భారత సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ కాగా, వ్యోమికా సింగ్ భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్.
The story of Operation Sindoor as told by Colonel Sophia Qureshi will fill every Indian heart with pride🇮🇳#IndianArmy#IndianNavy#IndianAirForce#OperationSindoor#ColonelSophiaQureshi#NewsUpdatepic.twitter.com/hB8UMSoZzj
— Oneindia News (@Oneindia) May 7, 2025
భారత ఆర్మీ ఆఫీసర్:
సోఫియా ఖురేషి 1981లో గుజరాత్‌లోని వడోదరలో జన్మించింది. ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. సోఫియా తాత కూడా సైన్యంలోనే ఉన్నారని, ఆమె తండ్రి కూడా కొన్ని సంవత్సరాలు సైన్యంలో మత గురువుగా పనిచేశారు. మరో నివేదిక ప్రకారం, సోఫియా మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీకి చెందిన ఆర్మీ ఆఫీసర్ మేజర్ తాజుద్దీన్ ఖురేషిని వివాహం చేసుకుంది. వారికి సమీర్ ఖురేషి అనే కుమారుడు ఉన్నాడు.
సోఫియా1999లో భారత సైన్యంలో చేరింది. ఆమె 1999లో చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందింది. దీని తరువాత సోఫియా ఆర్మీలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. 2006లో సోఫియా కాంగోలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో సైనిక పరిశీలకురాలిగా పనిచేశారు. ఆమె 2010 నుండి శాంతి పరిరక్షక కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉంది. పంజాబ్ సరిహద్దులో ఆపరేషన్ పరాక్రమ్ సమయంలో ఆమె చేసిన సేవలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (GOC-in-C) నుండి ప్రశంసా పత్రం కూడా అందుకుంది. ఈశాన్య భారతదేశంలో వరద సహాయక చర్యల సమయంలో ఆమె చేసిన అత్యుత్తమ కృషికి సిగ్నల్ ఆఫీసర్ ఇన్ చీఫ్ (SO-in-C) నుండి ప్రశంసా పత్రం కూడా ఆమెకు లభించింది. ఆమె ఫోర్స్ కమాండర్ నుండి ప్రశంసలను కూడా అందుకుంది.