Kolkata: కోలకత్తా ట్రామ్‌లు ఇక కనిపించవు

కోలకత్తా షాన్‌లో ఒకటైన ట్రామ్‌లు ఇక కిపించవు. వీటి సర్వీసులను ఆపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. వందేళ్ల పైబడిన చరిత్ర కలిగిన ఈ రవాణా సదుపాయం ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్నది ఈ ఒక్క నగరంలోనే. 

New Update
kolakata

Tram Service:

150 ఏళ్ళ నుంచి కోలకత్తాలోని ట్రామ్ లు నడుసతూనే ఉన్నాయి.  మొదట్లో దేశంలో చాలాచోట్ల ఈ ట్రామ్‌లు నడిచేవి. కానీ కాలక్రమంలో అన్ని నగరాల్లో ఇవి ఆగిపోయాయి. కానీ కోలకత్తాలో మాత్రం ట్రామ్‌లు ఇప్పటివరకు తిరుగుతూనే ఉన్నాయి. కోలకత్తా నగరంలో అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకునే వాటిల్లో ట్రామ్స్ కచ్చితంగా ఉంటాయి. అయితే ఇక మీట ఇవి ఉండు. ట్రామ్‌లను ఆపేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ విసయాన్ని రాష్ట్ర రవాణా మంత్రి స్నేహాశీస్ చక్రబర్తి తెలిపారు. 

కోలకత్తాలో 1873లోగుర్రాలతో నడిచే ట్రామ్‌లు ఉండేవి. అప్పటి నుంచి అవి మార్పులు చెందుతూనే ఉన్నాయి. వీటిని కోలకత్తా వారసత్వసంపదలో భాగంగా అయ్యాయి. కోలకత్తా రవాణా వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషించాయి. అయితే ఇప్పుడు వీటి వాడకం తగ్గిపోయాయి. దానికి తోడు ఇప్పుడు ఇతర వాహనా వాడకం ఎక్కువైపోయింది. ట్రామ్‌లు నెమ్మదిగా నడుస్తాయి. దీంతో రద్దీ టైమ్‌లో కోలకత్తాలో ట్రాఫిక్ జాయ్ అయిపోతోంది. అందుకే ఇప్పుడు వీటి సేవలను నిలిపివేయాలని కోలకత్తా ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం కోలకత్తాలో మైదాన్‌- ఎస్‌ప్లనేడ్‌ మార్గంలో మాత్రం కొంతకాలం పాటు వీటిని కొనసాగిస్తామని రవాణా మంత్రి తెలిపారు. ఈమధ్యనే ట్రామ్‌ల నిర్వహణ మీద కోలకత్తా హైకోర్టులో పిటిషన్‌ దాఖలవ్వగా.. గతేడాది డిసెంబరులో దీనిపై విచారణ జరిగింది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ట్రామ్‌కార్‌ సేవలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని సూచించింది. ఇంకా ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ప్రభుత్వం వీటికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేసేందుకు ట్రామ్‌ లవర్స్‌ సిద్ధమవుతున్నారు.

Also Read: ఆగనంటున్న స్టాక్ మార్కెట్ జోరు..85వేల మార్కును దాటేసిన సెన్సెక్స్

Advertisment
తాజా కథనాలు