ఆగనంటున్న స్టాక్ మార్కెట్ జోరు..85వేల మార్కును దాటేసిన సెన్సెక్స్

ఈరోజు దేశీ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డ్‌ను సమోదు చేశాయి. సెన్సెక్స్ మొదటిసారిగా 85వేల మార్కును దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా 26వేల స్థాయిని దాటింది. అయితే రోజు ముగిసేసరికి మాత్రం సూచీలు డౌన్ అయిపోయాయి. 

author-image
By Manogna alamuru
New Update
Disaster Recovery : సెలవు రోజు అయినా ఆరోజు స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది.. ఎందుకంటే.. 

Stock Market:

అసలే జోరు మీదన్న మార్కెట్ దానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి కూడా సానుకూల సంకేతాలు రావడంతో ఈరోజంతా సూచీలు ఉత్సాహంగా పని చేశాయి. దీంతో ట్రేడింగ్‌లో ఇవి సరికొత్త మైలురాళ్ళను అందుకున్నాయి. సెన్సెక్స్ ఉదయం 84,860.73 కొంచెం నష్టాలతో ప్రారంభమైనా...తర్వాత చాలా కొద్దిసేపటికే లాభాల్లోకి వచ్చేసింది.  సరికొత్త రికార్డ్‌లను అయితే స్థాపించింది కానీ రోజంతా అప్ డౌన్‌లతో తన ప్రయాణాన్ని సాగించింది. ఇంట్రాడేలో 85,163.23 దగ్గర జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 14.57 పాయింట్ల నష్టంతో 84,914.04 వద్ద ముగిసింది.మరోవైపు నిఫ్టీ కూడా  ఇంట్రాడేలో 26,011.55 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి కేవలం ఒక్క పాయింట్‌ లాభంతో 25,940.40 ఫ్లాట్‌గా ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.66గా ఉంది.

ఈరోజు సెనసెక్స్‌లో  టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడగా.. హిందుస్థాన్‌ యూనిలీవర్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. హెల్త్‌కేర్, రియాల్టీ, ఫార్మా, మీడియాతో సహా ఇతర రంగాలు కూడా మార్కెట్ హైచేరానికి తోడ్పడ్డాయి.  శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హెచ్‌యుఎల్, ఎస్‌బిఐ లైఫ్ లు మాత్రం క్షీణతను ఎదుర్కొన్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు