/rtv/media/media_files/2025/05/05/8vkPJK860zw5sYYAMrdx.jpg)
Viral Video huge tiger 'Hercules'
Viral Video: ఉత్తరాఖండ్‌లో 'హెర్క్యులస్' అనే అతిపెద్ద పులి సంచరిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పులి శరీరాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. దాదాపు 300 కిలోలు బరువు, 7 అడుగుల పొడవుతో గంభీరంగా కనిపించింది. దీంతో ఆసియాలోనే ఇది అతి పెద్ద పులి అయి ఉండవచ్చని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ పులిని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ పరిధిలోని ని ఫాటో టూరిజం జోన్‌లో గమనించారు. అక్కడ పులులు, చిరుతలు, ఏనుగులు వంటి అనేక వన్యజీవులు జీవిస్తాయి. కొన్ని దశాబ్దాల తరువాత భారత అడవుల్లో కనిపించిన ఇంత పెద్ద పులి ఇదే కావొచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడి జనాలు ఈ పులిని చూసేందుకు ఫాటో టూరిజం జోన్ కి తరలి వస్తున్నారు.
VIDEO | With the spotting of a huge tiger 'Hercules' in Phato Tourism Zone in Uttarakhand, the speculations are rife about it possibly being the biggest tiger ever. The tiger is 7 feet long and it weighs around 300 kg. With this, there is a curiosity among wildlife enthusiasts to… pic.twitter.com/uceHJ15p5Q
— Press Trust of India (@PTI_News) May 4, 2025
ఈ క్రమంలో దీనిపై అటవీశాఖ అధికారులు DFO ప్రకాష్ ఆర్య స్పందిస్తూ.. ఫాటో టూరిజం జోన్‌లో తాను ఇంత పెద్ద పులిని ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ దీప్ రాజ్‌వర్ మాట్లాడుతూ, హెర్క్యులస్‌ను అతిపెద్ద పులిగా ప్రకటించడం అతిశయోక్తి అవుతుందని, తనకు పెద్ద పులుల గురించి తెలుసునని అన్నారు.
హెర్క్యూలీస్ ఎందుకు ముఖ్యమైన జీవి?
ఇంత పెద్ద, బలమైన హెర్క్యూలీస్ పులి ఒకప్పుడు భారతదేశం అంతటా విస్తరించి ఉండేది. కానీ ఇప్పుడు అటవీ ప్రాంతాలు తగ్గిపోవడంతో ఈ పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది. అడవుల్లో ఈ పులులు కనిపించడమే కనుమరుగైంది. అలాంటి హెర్క్యూలీస్ పులి ఇప్పుడు మళ్ళీ అడవుల్లో కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
latest-news | telugu-news | tiger Hercules | viral-video