ప్రతీరోజూ 50 కోట్లకు పైగా లావాదేవీలు..

ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లావాదేవీల పరిణామం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42 శాతం పెరిగింది. అంటే రోజువారీ లావాదేవీలు రూ.50 కోట్లకు పైగా జరుగుతున్నాయి.

UPI
New Update

దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI) చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యూపీఐ నుంచి ఏకంగా రూ.20.64 లక్షల కోట్ల చెల్లింపులు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. లావాదేవీల పరిణామం సెప్టెంబర్‌లో గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 42 శాతం పెరిగి 1500 కోట్లకు చేరడం విశేషం. దీన్నిబట్టి చూస్తే.. రోజువారీ లావాదేవీలు 50 కోట్లకు పైగా జరుగుతున్నాయి. మరో విషయం ఏంటంటే భారత్‌లోనే కాకుండా దుబాయ్, కువైట్, ఖతార్, మరిషస్ లాంటి ఇతర దేశాల్లో కూడా ఎన్‌పీసీఐ యూపీఐ సేవలు అమల్లో ఉన్నాయి. అలాగే అంతర్జాతీయంగా యూపీఐ లావాదేవీలు పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  

Also Read: పార్టీ పేరును ప్రకటించిన పీకే

ఈమధ్యకాలంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడం కంటే మొబైల్‌తోనే డిజిటల్ లావదేవీలు చేయడం మేలని నమ్ముతున్నారు. చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద కంపెనీల వరకు ఎక్కడా చూసిన యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికి కూడా ఈ లావాదేవీలను ట్రాక్ చేయడం సులభతరమవుతోంది. అయితే కొన్ని థర్డ్‌ పార్టీ యూపీఐ యాప్‌లనే యూజర్లు ఎక్కువగా వాడటంపై ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఏదైనా భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తితే తీవ్ర నష్టం జరుగుతుందని చెబుతోంది. ఈ థర్డ్‌పార్టీ యూపీఐ కంపెనీలు వినియోగదారులకు ఎక్కువ వడ్డీలోన్లు ఆశచూపించి భారీగా లాభపడుతున్నట్లు కొందరు నిపుణులు అంటున్నారు.   

మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా పెరుగుతున్నట్లు గతంలోనే కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా మొదటి ఐదు నెలల్లో (ఏప్రిల్ - ఆగస్టు) డిజిటల్ చెల్లింపుల విలువ రూ.1,669 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ఇదే కాలంలో డిజిటల్ చెల్లింపుల లావాదేవీల పరిమాణం 8,659 కోట్లకు చేరిందని వెల్లడించింది. తాజాగా సెప్టెంబర్‌లో జరిగిన యూపీఐ లావాదేవీలు కలుపుకుంటే ఈ పరిణామం మరింత పెరుగుతుందని తెలిపింది. 

#telugu-news #national-news #upi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe