Ujjaini: కూలిన ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయ గోడ.. ఇద్దరు మృతి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ కూలిపోవడంతో ఇద్దరు వీధి వ్యాపారులైన మహిళలు మృతి చెందారు. ఇంకా కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. By Bhavana 28 Sep 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో గేట్ నంబర్ 4 గోడ ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్న భక్తులు, చిరువ్యాపారులు ఆ గోడ శిథిలాల కింద చిక్కుకుపోయారు. వీరిలో ఇప్పటివరకు ఇద్దరు మహిళలు చనిపోగా.. చాలా మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని ఉజ్జయిని జిల్లా ఆస్పత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉజ్జయినిలో భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోని జ్యోతిషాచార్య పండిత ఆనంద్ శంకర్ వ్యాస్ ఇంటి సమీపంలో ఉన్న పాత ప్రహరీ గోడ కూలిపోయింది. ఆ ప్రహరీ గోడ పక్కన వీధి వ్యాపారాలు చేసుకునే వారు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు ఆ శిథిలాల కిందే చనిపోయినట్లు ఆలయ నిర్వాహకులకు సిబ్బంది ప్రమాదం గురించి తెలియజేశారు. Mahakal temple wall collapses in Ujjain amid heavy rain, two dead, several trapped pic.twitter.com/o37n2mp5UR — Ajax | アヤックス🔅 (@ajax_chd) September 27, 2024 వెంటనే స్పందించిన ఆలయ అధికారులు పోలీసులు, రెస్క్యూ అధికారులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు మొదలుపెట్టారు. మహాకాళేశ్వర పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, స్థానికుల సహాయంతో శిథిలాల కింది నుంచి గాయపడిన కొందరిని బయటకు తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. A boundary wall of the #Mahakal Temple in #MP's #Ujjain has collapsed due to heavy rainfall. Several people are feared trapped under the debris. More details awaited. #MahakalTemple #MadhyaPradesh #WallCollapse pic.twitter.com/z3FrMTolyE — Lokmat Times Nagpur (@LokmatTimes_ngp) September 27, 2024 ఇంకా ఆ శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో అనేది తెలియాల్సి ఉంది. Also Read: ఉరికంబంపై ఉన్నప్పుడు భగత్ సింగ్ ఏమన్నాడో తెలుసా? #ujjaini-mahankali-temple #madhya-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి