ఇదో విచిత్రమైన సంఘటన. చనిపోయిందనుకున్న ఓ వృద్ధురాలని చితిపై పెట్టారు. అంత్యక్రియలు చేస్తున్న సమయంలో ఆమె లేచి నీళ్లు అడిగి అక్కడున్న వారందరినీ షాక్‌కు గురి చేసింది. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులోని తిరుచ్చిలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?
తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని కురుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన 72ఏళ్ల పంపైయ్యన్, అతని భార్య 62 ఏళ్ల చిన్నమ్మాల్ పూలతోట నడుపుతున్నారు. ఈ నెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు ఆమెను సమీప ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.
Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా
అక్కడ ఆమె పరిస్థితి విషమించడంతో చేసేదేమి లేక చిన్నమ్మాల్‌ను తిరిగి ఇంటికి పంపించేశారు. తిరుగు ప్రయాణంలో చిన్నమ్మాల్ మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచినట్లు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని వారి వారి బంధువులకు తెలుపగా.. వారు బోరున విలపిస్తూ శ్మశానవాటికకు చేరుకున్నారు.
Also Read: Dog యజమానులకు షాక్.. భారీ జరిమాన కట్టాల్సిందే..!
దహనానికి అన్ని ఏర్పాటు
అందరూ అక్కడకు చేరుకుని చిన్నమ్మాల్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆమె శరీరాన్ని దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు చిన్నమ్మాల్‌ను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. అదే సమయంలో కొందరు దగ్గర బంధువులు ఆమెపై పడి బోరున విలపించారు.
Also Read: USA: అమెరికాకు పొంచి ఉన్న ముప్పు..దూసుకొస్తున్న బాంబ్ సైక్లోన్
చితి నుంచి పైకి లేచి నీళ్లు అడిగిన అవ్వ
అప్పుడే ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. వెంటనే చిన్నమ్మాల్ తన మీద పడి ఏడుస్తున్న బంధువులలో ఒకరి చేయి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడున్నవారంతా ఖంగుతిన్నారు. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు.