భారత్–పాకిస్తాన్ బోర్డర్, యుద్ధాల ప్లేసెస్‌లో కూడా ఇక మీదట హాయిగా పర్యటించవచ్చును. ఈ విషయమై భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకుంది. కార్గిల్, సియాచిన్ గ్లేసియర్, గల్వాన్‌లలో పర్యటకులకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటకాభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. కొంతకాలంగా సందర్శకుల పెరుగుదల భారీగా కనిపిస్తోంది. ప్రస్తుతం టెర్రరిజం కూడా బాగా తగ్గింది. ఇప్పుడు ఈ ప్రాంతాలు కూడా సేఫ్ జోన్‌లుగా మారుతున్నాయని ద్వివేది అన్నారు. అందుకే ఇక్కడ పర్యటకాన్ని ప్రోత్సహించేందుకు 48 ప్రాంతాలను గుర్తించామని.. వచ్చే ఐదేళ్లలో పర్యటకుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ద్వివేది చెప్పారు.
బోర్డర్‌లో సాహస కార్యకలాపాలు..
పుణె యూనివర్సిటీలో భారత్ వృద్ధి పయనంలో ఇండియన్ ఆర్మీ పాత్ర అంశంపై జనరల్ ద్వివేది ప్రసంగించారు. కాశ్మీర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సమించే భాగంలో..సరిహద్దు ప్రాంతాల్లో పర్యటకుల కోసం సాహస కార్యకలాపాలను ఏర్పాఉ చేఇస్తాని...ఆర్మీ పర్యవేక్షణలో ఇది జరుగుతుందని ద్వివేది చెప్పారు. దీని కోసం ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. కార్గిల్, గల్వాన్ వంటి యుద్ధక్షేత్రాలను చూసేందుకు పర్యటకులకు అనుమతిస్తాన్నారు. లద్ధాఖ్‌లోని కారాకోరం పర్వత శ్రేణుల్లో ఉన్న సియాచిన్ గ్లేసియర్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం. సియాచిన్‌లో పని చేయడం అంటే మాటలతో కూడుకున్న పని కాదు. ఇక్కడ ఆర్మీ చాలా కష్టపడి పహారా కాస్తుంటారు. ఇక కార్గిల్ గురించి అందరికీ తెలిసిందే. కార్గిల్‌లో 1999లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. గల్వాన్ లోయలో భారత్-చైనా బలగాల మధ్య 2020 జూన్‌లో చోటుచేసుకున్న ఘర్షణల్లో అనేక మంది చనిపోయారు.
Also Read: పది నిమిషాలకో మహిళ లేదా బాలికను చంపేస్తున్నారు–యూఎన్ విమెన్ నివేదిక