supreme Court: బిల్కిస్ బానో కేసులో గుజరాత్‌కు చుక్కెదురు

బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దోషులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను తొలిగించేందుకు కోర్టు నిరాకరించింది. 

New Update
Supreme Court on Promotions: ప్రమోషన్స్ విషయంలో అలా చేస్తే ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే: సుప్రీంకోర్టు 

Bilkis Bano case: 

2002లో గుజరాత్ గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానోను అత్యాచారం చేసి ఆమె మొత్తం కుటుంబాన్ని చంపేశారు. ఇందులో దోషులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ ప్రభుత్వ అనుమతితో 11 మందిని మాత్రం ముందస్తుగానే వదిలేశారు. దీని మీద గతంలోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షా కాలం పూర్తి కాకుండా సత్ప్రవర్తన అని ఎలా వదిలేస్తారు అంటూ మండిపడింది. దోషులందరూ వెంటనే లొంగిపోవాలని ఆర్డర్ కూడా జారీ చేసింది.   వారిని విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఇది చట్ట ఉల్లంఘనేనని తెలిపింది కోర్టు అప్పుడు వ్యాఖ్యలు చేసింది. గుజరాత్‌ సర్కార్‌ దోషులతో కుమ్మకైందని.. అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ధర్మాసనం విమర్శించింది.

ఈ వ్యాఖ్యలపై గుజరాత్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు వాదించారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర వ్యాఖ్యలు చేశారని అన్నారు. అయితే ఇప్పుడు ఈ పిటిషన్‌ను బీవీ నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో  కూడిన ధర్మాసనం కొట్టేసింది. కోర్టు కరెక్ట్‌గానే మాట్లాడిందని..కేసులో దోషులుగా ఉన్న 11 మందిని విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. అసలు ఆ ఆలోచనే తప్పు అంటూ తీవ్ర విమర్శలు చేసింది.

Also Read: ఫుల్ ఫోర్స్‌తో హెజ్బుల్లా మీద దాడి చేయండి..సైన్యానికి నెతన్యాహు ఆర్డర్

Advertisment
Advertisment
తాజా కథనాలు