Sanitation worker : ఆ పారిశుద్ధ్య కార్మికురాలు  కోట్లాది హృదయాలను గెలుచుకుంది.

అంజుమానే..ఓ పారిశుద్ధ్య కార్మికురాలు.. పూణే లోని సదాశివపేటలో పనిచేస్తుంది. ఇటీవల ఆమె చేసిన పని అందరి హృదయాలను హత్తుకుంది. అంజు మానే తనకు దొరికిన రూ. 10 లక్షలతో  కూడిన బ్యాగ్ ను బాధితులకు  తిరిగి ఇవ్వడం ద్వారా హృదయాలను గెలుచుకుంది

New Update
FotoJet - 2025-11-22T103821.914

sanitation worker won millions of hearts.

Sanitation worker :  ఆమె కష్టమే ఆమె జీవితం, నిజాయితీనే ఆమె ఆభరణం. చెత్త కుప్పల మధ్య పనిచేస్తున్న ఆమె చేతికి అనుకోకుండా ఒక బ్యాగు తగిలింది. ఉత్సాహంగా తెరిచి చూసిన అంజూ కళ్లు ఒక్కసారిగా ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అందులో లెక్కకు మించిన రూ. 10 లక్షల నగదు! ఆమెకు ఆ డబ్బు కలలో కూడా ఊహించని సంపద. కానీ, నిరుపేద అయినా, కష్టజీవి అయినా, ఆ మనసు మలినం కాలేదు. క్షణం కూడా ఆలోచించకుండా, ఆ సంపదను పక్కన పెట్టి, దాని అసలు యజమాని కోసం వెతకడం మొదలుపెట్టింది...

అంజుమానే..ఓ పారిశుద్ధ్య కార్మికురాలు.. పూణే లోని సదాశివపేటలో పనిచేస్తుంది. ఇటీవల ఆమె చేసిన పని అందరి హృదయాలను హత్తుకుంది. ఒక సామాన్య పారిశుద్ధ్య కార్మికురాలికి అంతటి గొప్ప మనసు ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ, ఆమె చేసిన పని నేడు వేలాదిమంది మనసుల్లో స్థిరమైన స్థానాన్ని కల్పించింది. అంజు మానే తనకు దొరికిన రూ. 10 లక్షలతో  కూడిన బ్యాగ్ ను బాధితులకు  తిరిగి ఇవ్వడం ద్వారా హృదయాలను గెలుచుకుంది.

వివరాల ప్రకారం ..ఎప్పటిలాగే, నవంబర్ 20న, పారిశుద్ధ్య కార్మికురాలైన అంజుమానే  పూణే లోని సదాశివపేటలో వ్యర్థాలను తీసే పని చేసేందుకు వెళ్లింది. అపుడు సమయం ఉదయం 7 గంటల అవుతుంది.  ఆ ఉదయం నుండి సదాశివ్ పేట్ ప్రాంతంలోనే పని చేస్తోంది. అనంతరం సేకరించిన చెత్తను ఫీడర్ పాయింట్‌కు తీసుకువస్తుండగా, ఉదయం 8 నుండి 9 గంటల మధ్య రోడ్డు పక్కన పడి ఉన్న ఒక సంచిని గమనించింది.మానే ఇంతకు ముందు అలాగే పలు సంచులను చూసిన అనుభవం ఉంది. చాలామంది తమ మందుల సంచులను మరిచిపోవడం, పారేసుకోవడం చాలాసార్లు అనుభవించింది, కాబట్టి ఆమెకు దొరికిన ఆ బ్యాగ్‌ను ఫీడర్ పాయింట్‌లో భద్రంగా దాచింది.


ఆ తర్వాత తన పని ముగించుకుని వెళ్లే సమయంలో ఆ బ్యాగును తెరిచి చూసింది.అందులో మందులతో పాటు నగదు కూడా ఉందని ఆమె గ్రహించింది. దాదాపు 20 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఆమెకు ఈ ప్రాంత పౌరులందరూ తెలుసు. దీనితో మానే తనకు తెలిసిన నివాసితుల సహాయంతో ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరినీ సంప్రదించింది. ఇంతలో, ఒక వ్యక్తి చాలా ఆందోళనగా ఏదో వెతుకుతున్నట్లు ఆమె గమనించింది. స్థానికులు  ముందుగా అతనికి నీళ్ళు ఇచ్చి శాంతింపజేయడానికి ప్రయత్నించారు. అనంతరం అతని ఆందోళనకు కారణం డబ్బులు ఉన్న బ్యాగ్‌ పోవడమేనని గ్రహించారు. వెంటనే అంజూ తనకు దొరికిన బ్యాగ్ అతనిదేనని నిర్ధారించుకుని, బ్యాగ్‌ను తిరిగి ఇచ్చారు, అందులో  అక్షరాల రూ. 10 లక్షలు ఉన్నాయని బాధితుడు పేర్కొనడం గమనార్వం.

అంజూ చేసిన పని ఆ పౌరుడుతో పాటు అక్కడ ఉన్నవారందరీని కూడా కదిలించింది. ఈ పౌరుడు అంజు తాయ్ నిజాయితీని మెచ్చుకుని ఆమెకు చీర, కొంత నగదు ఇచ్చి, ఆ ప్రాంత నివాసితులందరితో కలిసి ఆమెను సత్కరించాడు. ఈ ఘటన ద్వారా గత 20 ఏళ్లుగా ఆ ప్రాంతంలో  చెత్త సేకరించే వ్యక్తికి, పౌరుడికి మధ్య ఉన్న నమ్మక బంధం మరింత బలపడిందని అంజు మానే మరోసారి నిరూపించింది.

Advertisment
తాజా కథనాలు