Ratan TATA: పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఇక లేరు

ద గ్రేట్ పారిశ్రామిక వేత్త, టాటా సన్స ఛైర్మన్ రతన్ టాటా కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ముంబయ్‌లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 

author-image
By Manogna alamuru
ratan
New Update

RATAN TATA: 

టాటా సన్స్ అధినేత రతన్‌ టాటా ఆరోగ్యం విషమంగా ఉందంటూ బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. ఆయన ముంబైలోని ఓ హాస్పిటల్‌లో.. ఐసీయూలో చికిత్స పొందుతున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా కొద్దిసేపటిక్రితం ఆయన చికిత్స పొందుతూ మరణించారని అనౌన్స చేశారు. ముంబై టాప్ పోలీస్ అధికారి ఈ వార్తను ధృవీకరించారు. పీటీఐకి చెప్పినట్టు తెలుస్తోంది. రతన్ టాటా శరీరంలో రక్తపోటు తగ్గడంతో ఆస్పత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. అప్పుడై ఆయన సరిప్థితి విషమంగా ఉందని...ఐసీయూ లో ఉంచి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.

రతన్ టాటా వయసు 86 ఏళ్ళు. 1937 డిసెంబర్ 28న ఆయన జన్మించారు. 1991 నుంచి 2012 వరకు రతన్ టాటా...ట్రాటా సన్స్ ఛైర్మన్‌గా చేశారు. అంతకు ముందు టాటా గ్రూప్ కంపెనీ అయి టాటా ఇండస్ట్రీలో అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని నెలలపాటు జంషెడ్‌పూర్‌లోని టాటా ప్లాంట్‌లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత రతన్ టాటా గ్రూప్ బాధ్యతలను తీసుకున్నారు. నానో కార్ రతన్ టాటా కలల కార్ అని చెబుతారు ఆయన ఇచ్చిన ఐడియాల ప్రకారమే దానిని తయారు చేశారు. అతి తక్కువ ధరకే లభించిన నానో కార్స్‌ కొన్నేళ్ళు ఇండియన్ మార్కెట్లో తెగ సేల్స్ అయ్యాయి. తరువాత నానో కార్‌‌ ప్రడ్షన్‌ను ఆపేశారు. అయితే ఇప్పుడు దాని అప్డేటెడ్‌ వెర్షన్ నానో ఈవీలను మార్కెట్లోకి తీసకురానున్నారని తెలుస్తోంది. 

రతన్ టాటా మృతికి ప్రధాని మోదీ సంతాపం తెలియజేశారు.రతన్‌ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త. దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారు. ఎంతోమందికి ఆయన ఆప్తుడయ్యారని మోదీ ఆయనను కొనియాడారు. 

#ratan-tata
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe