ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం దేశవ్యాప్తంగా కలచివేస్తోంది. వ్యాపార రంగం అభివృద్ధిలో.. ఆటోమొబైల్ సహా మరెన్నో రంగాల్లో విజయాలు సాధించడంలో ఎంతో కీలక పాత్ర పోషించారు.
Also Read: బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను చంపాలనుకోవడానికి అసలు కారణం ఇదే?
పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. ఆయన మరణం ఎంతో మందిని కలచివేసింది. తాజాగా ఆయన మృతిపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
మా పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారింది
వ్యాపార అంశాలతో ప్రారంభం అయిన తమ పరిచయం క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చిందని అన్నారు. అలా ఆ పరిచయం వ్యక్తిగత అనుబంధంగా మారిందని తెలిపారు. ఎప్పుడు తామిద్దరం చర్చించుకున్నా.. కార్లు, హోటల్లతో మొదలయ్యి.. అది ఇతర విషయాల వైపు వెళ్లేదని చెప్పుకొచ్చారు.
ఎంతో నిజాయితీగా చర్చించారు
దీంతోపాటు పలు అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. గతంలో అంటే 2017లో టాటా మోటార్స్ సంస్థకు ఉద్యోగుల యూనియన్‌కు మధ్య జీతాల సంబంధిత వివాదంపై చర్చలు జరిగాయని.. ఆ చర్చల్లో టాటాతో పాటు తాను కూడా పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సమస్య పరిష్కరించే విషయంలో టాటా ఎంతో నిజాయితీగా వారితో చర్చించారని అన్నారు.
Also Read: రతన్ టాటా కలలుగన్న నానో కారు.. ఫెయిల్యూర్ ఎందుకైందో తెలుసా?
అంతేకాకుండా ఆ చర్చల్లో తక్షణ పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వారి ఫ్యామిలీ శ్రేయస్సును కాంక్షిస్తూ అటు వైపుగా ఫోకస్ పెట్టారని చెప్పారు. అదే సమయంలో బాంబే హౌస్ పునరుద్ధరణ అంశంపై జరిగిన చర్చ గురించి కూడా మాట్లాడారు. 1924లో బాంబే హౌస్‌ను నిర్మించారు. దీనిని అత్యంత పవిత్ర స్థలంగా భావించే వారు. కొన్ని దశాబ్దాల పాటు ఎలాంటి మరమ్మతులు చేయలేదు.
ఆయన జ్ఞాపకశక్తి చూసి ఆశ్చర్యపోయాను
అయితే ఓ సారి ఈ విషయంపై టాటాతో మాట్లాడానని అన్నారు. అప్పుడే ఆయన శునకాల గురించి మాట్లాడారన్నారు. అంతేకాకుండా టాటా ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడున్న ప్రతీదాన్ని గుర్తుపెట్టుకునేవారని అన్నారు. అవి ఏళ్లు గడిచిపోయినా మరిచిపోయేవారు కాదని తెలిపారు. ఆ సమయంలో ఆయన జ్ఞాపకశక్తి చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. ఇవి మాత్రమే కాకుండా టాటా గురించి చెప్పాలంటే మరెన్నో విషయాలు ఉన్నాయని అన్నారు.