ప్రైవేట్ ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఒక వ్యక్తికి చెందిన ప్రతీ ప్రైవేట్ ఆస్తి వనరులను సమాజానికి సంబంధించిన మెటీరియల్ రిసోర్స్‌గా పరగణించలేమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
ఇది కూడా చూడండి: Jio IPO: త్వరలో రాబోతున్న జియో ఐపీఓ.. ఎప్పుడంటే?
తొమ్మిది మంది న్యాయమూర్తులతో..
ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న అన్ని ఆస్తులను ప్రయోజనాల కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి వీలులేదని మూడు భాగాల తీర్పుతో ధర్మాసనం తేల్చిచెప్పింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, బివి నాగరత్న, సుధాన్షు ధులియా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రా, రాజేష్ బిందాల్, సతీష్ చంద్ర శర్మ, అగస్టిన్ జార్జ్ మసి కలిసి ఆర్టికల్ 39(బి) ప్రకారం ఈ తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ 8:1 మెజారిటీతో తీర్పు ఇచ్చింది.
ఇది కూడా చూడండి: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. సర్వేలు ఏం చెబుతున్నాయంటే?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ప్రకారం గతంలో కర్ణాటక, రంగనాథ రెడ్డి కేసుల విషయాలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అలాగే 1982లో సంజీవ్ కోక్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ కేసును కూడా సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఇది కూడా చూడండి: Rangareddy District: బాలుడి ప్రాణం తీసిన స్కూల్ గేట్..
సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ ప్రైవేట్ ఆస్తులను సమర్పించినందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. అయితే ప్రైవేట్ ఆస్తులు అన్ని కూడా మానవ నిర్మిత పబ్లిక్ లేదా ప్రైవేట్ యాజమాన్యంలోని వనరులను కలిగి ఉంటాయని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులను ప్రజా ప్రయోజనాల కోసం, సహజ వనరులుగా భావిస్తూ ఉమ్మడి ప్రయోజనాలు కోసం వాడుకోవచ్చా? లేదా? అని సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పునిచ్చింది.
ఇది కూడా చూడండి: ఎండతో నడిచే కారు.. ఒకసారి ఛార్జింగ్‌తో 1600KM..