/rtv/media/media_files/2026/01/31/sunetra-pawar-takes-oath-as-deputy-cm-of-maharashtra-2026-01-31-17-09-44.jpg)
Sunetra pawar takes oath as deputy cm of maharashtra
అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లోని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర మొదటి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ నిలిచారు. ఇటీవల ఆయన భర్త ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం నేతలు సునేత్రను తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. దీంతో అజిత్ పవార్ స్థానంలో ఆమె తాజాగా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
#WATCH | Mumbai, Maharashtra: Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan
— ANI (@ANI) January 31, 2026
Maharashtra CM Devendra Fadnavis, Deputy CM Eknath Shinde and other leaders present. pic.twitter.com/qL8IIvNeoR
ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోవడంతో రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిబంధనల ప్రకారం రాష్ట్ర శాసనసభకు లేదా శాసనమండలికి ఎన్నిక కావాలి. దీంతో ఆమె తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయనున్నారు. అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన స్థానమైన బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఆమె పోటీ చేయనున్నారు.
Follow Us