పేదింటి కారు.. నానో వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా?

ఇండియాలో ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మినిమం నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులుంటారు. వారు ఎక్కడికి వెళ్లాలన్నా బైక్ పైనే అడ్జస్ట్ అయిపోతారు. దీంతో వాళ్లు ప్రాణాలు కోల్పోవడంతో రతన్ టాటా ఆలోచించి అతి తక్కువ ధరలో రూ.లక్ష లకే పేదింటి కారును తీసుకొచ్చారు.

ratan tata nano car
New Update
ప్రతి సంవత్సరం ఇండియాలో రోడ్ యాక్సిడెంట్ కారణంగా లక్షా యాభై వేల మందికి పైగా చనిపోతుంటే అందులో 50 శాతానికి పైగా కేవలం 2వీలర్స్ వారే ఉన్నారు. దానికి కారణం ఓవర్ లోడింగ్. ఇండియన్ మోటార్ లా ప్రకారం.. ఒక టూ వీలర్ బైక్ మీద ఇద్దరు మాత్రమే ప్రయాణించాలి. కానీ ఇండియాలో మాత్రం అది జరగదు.

ది పీపుల్స్ కార్

ఒక్కో సారి ముగ్గురు లేదా నలుగురు ఒకే బైక్ మీద జర్నీ చేసే కంట్రీ ఇండియా. ఎలా అయినా దీన్ని మార్చాలనుకున్నారు రతన్ టాటా. దీని ఆలోచన నుంచి పుట్టిందే టాటా నానో. ది పీపుల్స్ కార్. రతన్ టాటా తను లక్ష రూపాయలకు కారు తయారు చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాక ప్రపంచంలో ఎన్నో దేశాల ఆటో మొబైల్ కంపెనీలు, మీడియాలు, ఆటో ఛానెల్స్ ఆశ్చర్యపోయాయి.

ఇండియన్ బైక్ మార్కెట్ తో పోటీ

ఆకాశం హద్దురా సినిమా చూసే ఉంటారు. అందులో సూర్య తక్కువ టికెట్ ప్రైజ్ తో ఎయిర్ లైన్స్ స్టార్ట్ చేసి సక్సెస్ అవుతారు. ఎందుకంటే తాను పోటీ పడేది ఇండియన్ ఎయిర్ లైన్స్ తో కాదు ఇండియన్ రైల్వేస్ తో. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. టాటా మోటార్స్ పోటీపడాలనుకుంది ఇండియన్ కార్ మార్కెట్స్ తో కాదు.. ఇండియన్ బైక్ మార్కెట్ తో. 

ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నానో

ఇండియాలో ఉన్న ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మినిమం నలుగురు లేదా ఐదుగురు వ్యక్తులు ఉంటారు. వారు ఎక్కడికి వెల్లాలన్నా బస్సు లేదా టూ వీలర్ ను ఎంచుకుంటారు. అయితే బస్సులో వెల్లాలంటే టికెట్ కోసం ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో ఫ్యామిలీలో నలుగురున్నా, ఐదుగురున్నా వారి వద్ద ఉన్న టూ వీలర్ మీద అడ్జస్ట్ అయి వెళ్లిపోతారు. వాళ్ల ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం కారణంగా వాళ్ల దగ్గరున్న టూ వీలర్ లోనే అందరూ జర్నీ చేస్తూ.. ఒకవైపు గవర్నమెంట్ రూల్స్ అతిక్రమిస్తున్నారు.
 మరోవైపు వాళ్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇది అసలైన ప్రోబ్లమ్. రతన్ టాటా సాల్వ్ చేయాలనుకున్న ప్రాబ్లమ్ ఇదే. అరవై నుంచి డబ్బైవేలు పెట్టి బైక్ కొని ఇబ్బందులు పడుతున్న పేద మధ్య తరగతి వాళ్లకి ఇంకొక ముప్పైవేలు పెడితే కంఫర్ట్ బుల్ గా ఒక కారులో వెళ్లొచ్చు అనే ఫీలింగ్ తీసుకురావాలనే ఇంటెన్సన్ తో రతన్ టాటా నానో కారును కేవలం ఒక లక్ష రూపాయలకు మాత్రమే అందిస్తామని మీడియా ముందు ప్రామిస్ చేశారు. అలానే తీసుకొచ్చారు.
#ratan-tata
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe