ఇటీవల ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ స్నేహితుడు, ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య తర్వాత లారెన్స బిష్ణోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌కు ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయన మాజీ ప్రేయసీ సోమీ అలీ కూడా లారెన్స్‌తో మాట్లాడాలి అనుకుంటున్నాని ఇటీవల సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసింది. తాజాగా ఇప్పుడు ఆమె మరికొన్ని కీలక విషయాలు వెల్లడించింది. '' నేను అపట్లో అవుట్‌డోర్ షూటింగ్‌కు వెళ్తుండేదాన్ని. కానీ సల్మాన్ ఖాన్ జింకను షూట్ చేసిన ఘటన జరిగినప్పుడు నేను ఆ షూటింగ్‌కి వెళ్లలేదు.
Also Read: కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్
సల్మాన్‌కు ఆ విషయం తెలియదు
అప్పట్లో సల్మాన్ ఖాన్‌కు వేట అంటే చాలా ఇష్టం ఉండేది. ఆయనతో వెళ్లిప్పుడు నేను జంతువులను చూసినప్పుడు దగ్గేదాన్ని. ఆ శబ్దానికి వెంటనే అవి పారిపోయేవి. ఈ షూటింగ్ సమయంలో సల్మాన్ నన్ను తనతో తీసుకెళ్లలేదు. నా వల్ల జంతవులు పారిపోతున్నాయని అందుకే తీసుకెళ్లట్లేదని సల్మాన్ అన్నారు. బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణజింకలను పూజిస్తారన్న విషయం సల్మాన్‌ఖాన్‌కు తెలియదు. అందుకే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు. తనకు తెలియని విషయం గురించి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పాలి.
Also Read: గ్రూప్-1 పరీక్ష కేంద్రం వద్ద ప్రమాదం
తెలియక చేసిన తప్పుకి బలవంతంగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఇది కరెక్టు కాదు. సల్మాన్ చాలా అహంకారీ.. కానీ చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు నాకు.. అతనితో గానీ అతని కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదు. బాలీవుడ్‌లోనో, హాలివుడ్‌లోనో ఎవరినీ హత్య చేయడం నాకు ఇష్టం లేదు. హింస ఎప్పుడూ పరిష్కారం కాదు. కృష్ణ జింక వేట జరిగిన ప్రదేశం 80 ఎకరాల్లో విస్తరించి ఉంది.
అందుకే ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు
సల్మాన్ ఖాన్ మాత్రమే వేటకు వెళ్లారని.. ఎవరూ కూడా అక్కడికి వెళ్లలేదని అంటున్నారు. సల్మాన్ స్టార్ హిరో కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. వాస్తవానికి చాలామంది ప్రజలు అక్కడికి వేటాడటం కోసం వస్తారు. ఇప్పటివరకు ఎవరూ కూడా కృష్ణ జింకను వేటాడలేదా ? బిష్ణోయ్ కమ్యూనిటీలో కృష్ణ జింకలను పూజిస్తారనే విషయం సల్మాన్ ఖాన్‌ను తెలియదు. ఈ ఘటన జరిగినప్పుడు ఆయన నాతో మాట్లాడారు. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకను ఆరాధిస్తారనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఈ విషయాన్ని బిష్ణోయ్ వర్గీయులు అర్థం చేసుకోవాలని'' సోమీ అలీ అన్నారు.