Road Accident : తమిళనాడులోని ఉలుందూరుపేట సమీపంలో తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్టటూరు సమీపంలో టూరిస్ట్ వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. మెట్టటూరు సమీపంలో బుధవారం తెల్లవారుజామున టూరిస్ట్ వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరిని వెంటనే విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టూరిస్ట్ వాహనంలో ఉన్నవారు తిరుచెందూర్ మురుగన్ ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా జరిగింది. వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.. వీరు అరణి సమీపంలోని మంబాక్కం నుంచి తిరుచెందూర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు, కళ్లకురిచ్చి జిల్లా సూపరింటెండెంట్ రజత్ చతుర్వేది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో.. పోలీసులు దాని క్లియర్ చేశారు. చనిపోయిన వారి వివరాలు, ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : ప్రతీకార రాజకీయాలకు భయపడేది లేదు– కర్ణాటక సీఎం సిద్ధరామయ్య