BIG BREAKING : కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. జమ్మూలో మళ్లీ కాల్పులు(VIDEO)

కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన బుద్ది చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

New Update
pak again fire

pak again fire

కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన వక్రబుద్దిని చూపించింది. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడింది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఫిరంగి దాడులకు పాల్పడింది. జమ్మూ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు అనేక నగరాలపై డ్రోన్ , క్షిపణి దాడులు జరిగాయి. బారాముల్లాలో పేలుళ్లు సంభవించాయని, ఒక డ్రోన్‌ను కూల్చివేసినట్లు, ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా ఒక వైమానిక వాహనం (UAV) కనిపించినట్లు నివేదికలు వచ్చాయి. అటు భారత బీఎస్ ఎఫ్ జవాన్లు కూడా ధీటుగానే బదులిస్తున్నాయి.  

పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "కాల్పు విరమణ సంగతేంటి? శ్రీనగర్ అంతటా పేలుళ్లు వినిపించాయి!!!" అని ఆయన తన ట్వీ్ట్ లో తెలిపారు.  శ్రీనగర్‌లో ఐదు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది. 


అంతకుముందు, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాతో  మాట్లాడుతూ  భారత్చ, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని తెలిపారు.  పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్‌లో ఇండియన్ ఆర్మీతో ఫోన్ లో   సంప్రదించారని, సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలు చేయడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు.  

Advertisment
తాజా కథనాలు