Kolkata Trainee Doctor Case:
కోలకత్తా ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర రేప్, మర్డర్ కేసు విషయం ఇంకా రగులుతూనే ఉంది. ఈ కేసు విషయంలో నిందులు ఎవరన్న దానిపై సీబీఐ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా సీల్డాలోని అదనపు ఛీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులోసబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇందులో సంజయ్ రాయ్ ఒక్కడే ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేశాడని చెప్పింది. ఈ ఘటనలో సామూహిక అత్యాచారం జరగలేదని తేల్చి చెప్పింది. రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. రాయ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ.. దాదాపు 200 మంది వాంగ్మూలాలు నమోదయ్యాయని సీబీఐ చార్జిషీట్‌లో తెలిపింది. సంజయ్ కాంట్రాక్టు ప్రాతిపదికన పోలీసులతో కలిసిన వాలంటీర్‌గా పని చేశాడని వివరాలు ఛార్జ్ షీట్‌లో పొందుపరిచింది. అయితే ఇందులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాత్ర ఏంటన్నది ఇంకా తెలియలేదు.
ఆగస్టు 9న ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌ను రేప్ చేసి చంపేశారు. ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. జూనిర్ డాక్టర్లు, మెడికల్ విద్యార్ధులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ,కోలకత్తా పోలీసులు ఘటనను, సాక్ష్యాలను రూపుమాపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు మర్నాడే సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేఉ విషయంలో పోలీసులు తీరు మీద తీవ్ర నిరసన వ్యక్తం అయింది. దీంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని కేసు సీబీఐకు అప్పగించింది. రెండు నెలలుగా ఈ కేసును దర్యాప్తు చేస్తోంది సీబీఐ. ఈ క్రమంలో ఆర్జీర్ మాజీ ప్రిన్సిపల్ మీద కూడా ఛార్జ్ షీట్ దాకలు చేసింది. ఇప్పుడు తాజాగా సంజయ్ రాయ్ ఒక్కడే రేప్ చేశాడంటూ కొత్త ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది సీబీఐజ దీని ప్రకారం కోర్టు ఏం శిక్ష వేస్తుందో చూడాలి. ఇక మరోవైపు కోలకత్తా జూనియర్ డాక్టర్లు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అంటున్నారు. అంతేకాక బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
Also Read: Sports: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇండియన్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్