Sports: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇండియన్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ భారత జిమ్నాస్టిక్స్ ప్లేయర్, ఒలింపియన్ దిపా కర్మాకర్ ఈరోజు తన కెరియర్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని..కానీ కెరియర్ ముగింపు పలకడానికి సరైన సమయంగా భావించానని చెప్పారు దీపా. By Manogna alamuru 07 Oct 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Deepa karmakar: ఇండియాలో జిమ్నాస్టిక్స్ అనగానే గుర్తొచ్చే పేరు దీపా కర్మాకర్. 2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో స్వర్ణ పతకం సాధించి తన సత్తా చాటారు. 2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. వరల్డ్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఛాంపియన్‌షిప్స్‌కీ, ఒలింపిక్స్‌కీ అర్హత సాధించిన మొదటి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించారు. 2016 ఒలింపిక్స్‌లో 0.15 పాయింట్లతో కాంస్య పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచారు. తరువాత ఒలింపిక్స్‌లో ఈమె పాల్గొనలేదు. అయితే దీపాను స్ఫూర్తిగా తీసుకుని భారతదేశంలో చాలా మంది జిమ్నాస్టిక్స్‌లో చేరారు. ఇక ఈ సాడాది ఆసియా జిమ్నాస్టిక్స్ ఛాంపియన్ షిప్‌లో స్వర్ణం గెలిచారు. ఈ ఘనత సాధించిన మొదటి క్రీడాకారిణి కూడా ఈమెనే. అయితే ఈరోజు దీపా కర్మాకర్ తన జిమ్నాస్టిక్స్ కెరియర్‌కు స్వస్తి పలికారు. ఈ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానని...తన శరీరం, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిసైడ్ అయ్యానని చెప్పారు. ఇది అంత తేలికైన నిర్ణయం కాదని కానీ కెరీర్ కు ముగింపు పలకడానికి దేన సరైన సమయంగా భావించానని అన్నారు. Also Read: కొత్త గరిష్టాలకు చేరుకున్న బంగారం మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి