రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్.. మహిళా రెజ్లర్లను లైంగిక ఆరోపించారన్న వ్యవహారం గతంలో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ తన బయోగ్రఫీకి సంబంధించి ఓ బుక్‌ను విడుదల చేశారు. 2016 రియో ఒలింపిక్స్ మెడల్ సాధించిన సాక్షి కొన్ని నెలల క్రితమే రెజ్లింగ్‌ను వదిలేశారు. అయితే ఆమె తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆ పుస్తకంలో వివరించారు. 2012లో కజకస్థాన్‌లోని ఆసియా జూనియర్ ఛాంపియన్‌షిప్ జరిగిన సమయంలో బ్రిజ్ భూషణ్ తనను హోటల్ రూమ్‌లో లైంగికంగా వేధించినట్లు పేర్కొన్నారు.
Also Read: వక్ఫ్ బోర్డ్ బిల్లుపై ఘర్షణ.. వాటర్ బాటిల్‌ను పగలగొట్టిన టీఎంసీ నేత
ఫోన్‌లో తన తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బ్రిజ్ భూషణ్ ఉంటున్న హోటల్ రూమ్‌కు పంపించారని.. కానీ అక్కడ జరిగిన ఘటన తన జీవితంలో చేదు ఘటన అని సాక్షి మాలిక్ చెప్పుకొచ్చారు. బ్రిజ్ భూషణ్ తన పేరేంట్స్‌తో మాట్లాడటం కోసం ఫోన్ కలిపారు.. అప్పటివరకు అతనితో ఎలాంటి హామీ లేదని అనుకున్నాను. మ్యాచ్, మెడల్ గురించి నా పేరెంట్స్‌తో మాట్లాడాను. ఫోన్ పెట్టేశాక.. బ్రిజ్ భూషణ్ బెడ్‌పై కూర్చున్న సమయంలో అతను నన్ను లైంగికంగా వేధించేందుకు యత్నించాడు. నేను అతడిని తోసేసి ఏడ్వడం మొదలుపెట్టాను. ఆ తర్వాత బ్రిజ్ భుషణ్ వెనక్కి తగ్గాడు. అతనికి కావాల్సింది నేను చేయలేనని అర్థమైంది. ఆ తర్వాత తనపై ఓ తండ్రిలా చేతులు వేశానని చెప్పాడు. కానీ అతని ఉద్దేశం అది కాదని నాకు తెలుసు. ఏడ్చుంటూ అతని రూమ్ నుంచి బయటకు వచ్చేశాను'' అని సాక్షీ మాలిక్ తన ఆటోబయోగ్రఫీలో రాసుకొచ్చింది.
Also Read: బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..
అంతేకాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినట్లు సాక్షి మాలిక్ గుర్తు చేశారు. చిన్నతనంలో ట్యూషన్‌కు వెళ్లినప్పుడు తన ట్యూషన్ టీచర్ కొన్ని సందర్భాల్లో అసభ్యకరంగా టచ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ట్యూషన్‌కు వెళ్లాలంటేనే భయమయ్యేదని.. ఈ విషయాన్ని అమ్మకు చెప్పేందుకు భయపడేదాన్నని సాక్షీ మాలిక్ తన బుక్‌లో తెలిపింది.
Also Read: బిగ్ బాస్ షోలో గంగవ్వకు గుండెపోటుపై కీలక ప్రకటన
Also Read: కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షిపై సంచలన ఆరోపణలు