టికెట్ రాలేదని బట్టలు చింపుకున్న RJD నేత.. లాలూ ప్రసాద్ ఇంటి వద్ద నిరసన

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ దక్కని అభ్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కని ఆర్‌జేడీ నాయకుడు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం బయట తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు

New Update
bihar rjd

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలో ఎన్నికల టికెట్ల కేటాయింపు ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ దక్కని అభ్యర్థులు రచ్చ రచ్చ చేస్తున్నారు. టికెట్ దక్కని ఆర్‌జేడీ నాయకుడు, పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం బయట తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు. పార్టీ టికెట్ నిరాకరణతో మనస్తాపం చెందిన మాజీ ఆర్‌జేడీ అభ్యర్థి మదన్ షా (Madan Shah), లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వెలుపల నిరసనకు దిగారు.

మదన్ షా సంచలన ఆరోపణలు

కన్నీటి పర్యంతమవుతూ, తీవ్ర ఆగ్రహంతో తన కుర్తాను చించుకున్నారు. టికెట్ నిరాకరణకు సంబంధించి మదన్ షా సంచలన ఆరోపణలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ తనకు హామీ ఇచ్చారని, అయితే ఆర్‌జేడీ నాయకుడు సంజయ్ యాదవ్ తనను రూ. 2.7 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపించారు. తాను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, పార్టీ టికెట్‌ను మరొక అభ్యర్థికి కేటాయించారని షా తెలిపారు.

పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, మదన్ షా లాలూ ఇంటి బయట భోరున విలపించారు. పార్టీ నాలాంటి నిజాయితీపరులైన, కష్టపడి పనిచేసే కార్మికులను విస్మరించింది. ఇప్పుడు డబ్బున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని షా కన్నీళ్లు పెట్టుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మరో వీడియోలో పాట్నాలోని తన నివాసానికి చేరుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ కారును వెంబడించడానికి షా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.చివరికి భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవలసి వచ్చింది.  ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

Advertisment
తాజా కథనాలు