Karnata CM Sidhha Ramayya:
ముడా స్కామ్కు సంబంధించి హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ కుంభకోణం విషయంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది.
ముడా స్కామ్ లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్‌నే ఈరోజు కోర్టు కొట్టివేసింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లాభాలు పొందడమే కాకుండా...దాని కోసం ముఖ్యమంత్రి అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను సీఎం సిద్దరామయ్య ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా సామాజిక కార్యకర్త టి.జె.అబ్రహం గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా.. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో సీఎం హైకోర్టును ఆశ్రయించారు. ఒకవేళ దీని మీద సిద్ధరామయ్య కనుక విచారణ ఎదుర్కోవలసి వస్తే...ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ ప్రతిపక్షాల నుంచే కాక సొంత పార్టీ నుంచి కూడా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో దీని మీద సీఎం సిద్ధరామయ్య స్పందించారు. బీజేపీ, జేడీ(ఎస్)లు తన ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీటికి తాను లొంగేది లేదని...రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. నేను చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతాను...సత్యమే గెలుస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు సిద్ధరామయ్య. ఇంతకు ముందు ఆ రెండూ పార్టీలు ఇలాంటి వాటిల్లో విజయం సాధించొచ్చు కానీ ఇప్పుడు కాదని అన్నారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి? కేంద్ర మంత్రి కుమారస్వామి రాజీనామా చేశారా? అతను బెయిల్‌పై ఉన్నాడు కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ రాజకీయ పోరాటంలో తన వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్పుకొచ్చారు.
Also Read: Sri Lanka: అదానీకి శ్రీలంక అధ్యక్షుడు షాక్ ఇవ్వనున్నారా?