Sri Lanka: అదానీకి శ్రీలంక అధ్యక్షుడు షాక్ ఇవ్వనున్నారా? శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే...భారత టాప్ మిలియనీర్, ఇండస్ట్రలియస్ట్ అదానీకి షాక్ ఇవ్వనున్నారా అంటే...రిపోర్ట్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. అసలు అదానీకి, శ్రీలంకకు, దిసనాయకే కు ఏంటి సంబంధం? వివరాలు కింది ఆర్టికల్‌లో... By Manogna alamuru 24 Sep 2024 | నవీకరించబడింది పై 24 Sep 2024 20:43 IST in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి Srilanka New President Anura Kumara Disanayake: శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే. 2014లో అక్కడి జేవీపీ పార్టీ అధ్యక్షుడిగా అనుర కొత్త బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి వరకు జేవీపీలో ఒక సభ్యుడుగా ఉన్న ఆయన ఆ పార్టీకే అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. దీని తర్వాత జేవీపీని దేశ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంచడంలో అనుర సక్సెస్ అయ్యారు. అయితే ఇది ఆయనకు పెద్దగా ఏమీ ఉపయోగపడలేదు. 2019 ఎన్నికల్లో అనుర కుమార మొదటిసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ కేవలం 3శాతం ఓట్లను మాత్రమే సంపాదించుకోగలిగారు. జనతా విముక్తి పెరమునె నేతృత్వంలో నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ) కూటమి అభ్యర్ధిగా ఈయన పోటీ చేశారు. అయితే ఐదేళ్ళ తర్వాత మొత్తం చరిత్రను తిరగరాసారు దిసనాయకే. 3 శాతం ఓట్ల నుంచి శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేలా ఎదిగారు. ఒడిదుడుకుల్లో ఉన్న శ్రీలంక బాధ్యతలను నెత్తిన ఎత్తుకున్నారు. అదానీ ప్రాజెక్టు మీద వ్యతిరేకత... ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు అనుర కుమార శ్రీలంక అధ్యక్షుడు అవడం మన దేశానికి చెందిన అదానీకి చేటు కూర్చేలా ఉంది. అతను అధ్యక్షుడు అవడానికి...అదానీకి ఏమిటి సంబంధ అని ఆలోచిస్తున్నారా...ఇదిగో ఇందుకు. శ్రీలంకలో ఆదానీ కంపెనీ విండ్ అండ్ పర్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. జేవీపీ పార్టీ మొదటి నుంచి దీనికి వ్యతిరేకంగా ఉంది. తాము అధికారంలోకి వస్తే శ్రీలంకలో ఉన్న అదానీ విండ్ అండ్ పవర్ ప్రాజెక్టును రద్దు చేస్తామని అనుర కుమార ముందు నుంచే చెబుతూ వస్తున్నారు. శ్రీలంకకు ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించనున్న ఈ ప్రాజెక్టుకి తాము వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఇప్పుడు అధ్యక్షుడు అయిన తర్వాత దీని మీద మరింత పట్టుదలగా ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో పాటూ జేవీపీ పార్టీ కొంత ఇండియాకు వ్యతిరేకంగానే ఉంది. శ్రీలంకలో ఉంటున్న తమిళుల పట్ల ఈ పార్టీ స్టాండ్ మొదట నుంచి వేరుగానే ఉంది. ప్రస్తుతం శ్రీలంకకు ఇండియా, చైనా భారీగా రుణాలిస్తున్నాయి. ఇందులో చైనా వామపక్ష భావజాలం ఉన్న దేశం. అనుర కుమార పార్టీ అయిన జేవీపీ కూడా వామపక్ష భావజాలం ఉన్నదే. అందుకే ఈ పార్టీ, కొత్త అధ్యక్షుడు భారత్ కన్నా చైనాకే ఎక్కువ అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే అదానీ పార్టీని వ్యతిరేకించడం అనే టాక్ ఉంది. దాంతో పాటూ ప్రావిన్సులకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని చెప్పే ఇండియా - శ్రీలంక ఒప్పందాన్ని జేవీపీ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. శ్రీలంక తమిళయన్ల పట్లా వ్యతిరేకత... ఇక శ్రీలంక తమిళియన్ల పట్ల కూడా జేవీపీ వ్యతిరేకంగా ఉంది మొదటి నుంచీ. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈశాన్య ప్రాంతాల్లో పర్యటించినప్పుడు కూడా అనుర మాట్లాడుతూ..13వ రాజ్యాంగ సవరణను అమలు చేస్తా. నేను మిమ్మల్ని ఓట్లు అడగడానికి ఇక్కడకు రాలేదు. సమాఖ్య విధానం అందిస్తా. నాకు ఓటేయమని అడగడానికి ఇక్కడకు రాలేదు'' అన్నారు. ఇది తమిళ వర్గాల్లో నిరాశ కలిగించింది. అయితే, ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తన మాట మార్చారు అనుర. జూన్‌లో మరోసారి జాఫ్నా వెళ్లినప్పుడు తమిళ రాజకీయ నేతలను కలిశారు. దాని తర్వాత అనుర మాట్లాడుతూ ప్రావిన్షియల్ కౌన్సిల్స్ యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. తన పార్టీ దీనికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ఆయన ఈ ప్రామిస్ చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మరి ఏం చేస్తారో చూడాలి. ఇరుదేశాల మధ్యా శాండ్ విచ్ అవము.. అయితే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాక అనుర కుమార...తాము భారత్, చనాల మధ్య నలిగి పోదల్చుకోలేదంటూ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాలతో సత్సంబంధాలు తమకు అవసరమేనని...అందుకే భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకోనే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఓ వర్గం పక్షం వహించమని అన్నారు. శ్రీలంక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలంటే తటస్థ వైఖరి చాలా అవసరమని అనుర అభిప్రాయపడ్డారు. ప్రపంచ శక్తుల అధిపత్య పోరుకు శ్రీలంక దూరమన్నారు. అదే సమయంలో ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండేలా దౌత్య, భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపై తాము దృష్టిపెడతామని చెప్పారు. Also Read: 160 ఎకరాల్లో దుర్గం చెరువు ఉంది – హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి