Al Falah University : ఎర్రకోట బాంబ్‌ బ్లాస్ట్‌.. అల్‌-ఫలాహ్‌లో మరో వైద్యుడు మిస్సింగ్‌..?

ఎర్రకోట పేలుడు ఘటనతో హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ అయిన నిసార్ ఉల్‌ హసన్ కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (75)

Red Fort bomb blast.. Another doctor missing in Al-Falah..?

Delhi Red Fort Blast : ఎర్రకోట పేలుడు ఘటనతో హరియాణాలో ఉన్న ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాహ్‌ యూనివర్సిటీ హాట్‌ టాఫిక్‌గా మారింది. ఇప్పుడు ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌ అయిన నిసార్ ఉల్‌ హసన్ కనిపించకుండాపోయాడు. గతంలో అతడిపై ఉగ్ర ఆరోపణలు రావడం గమనార్హం. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

ఢిల్లీ పేలుడు తర్వాత అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం యూనివర్సిటీలో దర్యాప్తు అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం ఉన్న పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యాసంస్థలోనే నిసార్ పనిచేస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయని తెలుస్తోంది. 2023లో నిసార్‌ కశ్మీర్‌లోని ఎస్‌ఎంహెచ్‌ఎస్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేవాడు. ఉగ్రముఠాలతో అతనికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆర్టికల్ 311(2)(C) కింద ఉద్యోగం నుంచి తీసేశారు.నిసార్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్యోగం నుంచి తొలగించారు. 

దేశ భద్రతకు సంబంధించిన కేసుల్లో శాఖాపరమైన విచారణ లేకుండానే సదరు ఉద్యోగిని విధుల నుంచి తప్పించేందుకు ప్రభుత్వానికి  అన్నిరకాల వీలు ఉంటుంది. ఆ తర్వాత అతడికి యూనివర్సిటీలో మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలుపుతున్నాయి. అయితే అనుహ్యంగా నవంబర్ 10 పేలుడు తర్వాత అతడు కనిపించకుండా పోయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు  ప్రస్తుతం అతడి జాడ కోసం గాలిస్తున్నారు.

 ఇదిలా ఉంటే.. అల్‌-ఫలాహ్ విశ్వవిద్యాలయం ఉగ్రవాదులకు అడ్డగా మారిందని  వినిపిస్తోన్న కథనాల వేళ ఆ విద్యాసంస్థ స్పందించింది. ‘‘మా సంస్థలో విద్యనభ్యసించి, పట్టభద్రులైన వారు భారత్‌తో పాటు, విదేశాల్లో ప్రముఖ ఆసుపత్రులు, సంస్థల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతోన్న దురదృష్టకర పరిణామాలు మమ్మల్ని బాధించాయి. వాటిని మేం ఖండిస్తున్నాం. యూనివర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా కొన్ని ఆన్‌లైన్ సంస్థలు నిరాధార కథనాలు వ్యాప్తి చేయడంపై ఆందోళన చెందుతున్నాం.’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. దీనిపై పూర్తి విచారణ జరపాలని కోరుతోంది.

ఇది కూడా చూడండి: Delhi Bomb Blast: ఢిల్లీ బాంబు పేలుడు.. హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ!

Advertisment
తాజా కథనాలు