Matka Teaser
Matka Teaser: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మట్కా'. పీరియాడిక్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో '‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకురావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి'' అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇందులో వరుణ్ నాలుగు భిన్నమైన పాత్రల్లో కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
From nothing to everything,
— Varun Tej Konidela (@IAmVarunTej) October 5, 2024
It takes only ONE MOVE.
THE WORLD OF MATKA.🎲
Check out the teaser,
▶️- https://t.co/nrpJXzGGBK#MATKA#MATKAonNOV14th@KKfilmmaker@Meenakshiioffl#NoraFatehi@gvprakash@kishorkumardop@VyraEnts@SRTMovies@adityamusic@UrsVamsiShekarpic.twitter.com/w0QHPWISy3
1950,1980 బ్యాక్ డ్రాప్ కథాంశంతో మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ' మట్కా'. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ పై రజనీ తాళ్లూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం నవంబర్ 14న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
మట్కా టీజర్
అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ మట్కా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో వరుణ్ లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. '‘విశాఖపట్నం అంటే ఒకటి సముద్రం గుర్తుకురావాలి లేదా ఈ వాసు గుర్తుకురావాలి'' అంటూ వరుణ్ చెప్పిన డైలాగ్స్ హైలైట్ గా అనిపించాయి. ఇందులో వరుణ్ 4 డిఫరెంట్ షెడ్స్ లో కనిపించడం సినిమా పై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం