మావోయిస్టులు వర్సెస్ పోలీసులు..! ఎర్రదండు కదులుతుందా..? 2024లో ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో పోలీసుల కాల్పుల్లో 185మావోయిస్టులు మరణించారు. ఇక ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల సీఎంలతో కేంద్రం సమావేశం కానుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 05 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update Maoist Deaths Chattisgarh షేర్ చేయండి Maoist Deaths Chattisgarh: నిరుద్యోగం, అణచివేతలు, ఆకలి బాధలు, సామాజిక అవమానాలు, పేదరికం, చాలీచాలని వేతనాలు, పోలీసుల దౌర్జన్యాలు, ప్రభుత్వ అక్రమాలు..! ఓ పేదవాడు మావోయిస్టుగా మారడానికి కారణాలు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని చెబుతారు నక్సలైట్ల మద్దతుదారులు! అయితే ప్రభుత్వం మాత్రం తనపని తాను చేసుకుపోతూనే ఉంటుంది. మావోయిస్టు రహిత దేశమే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ అడవుల్లో ఎర్రదండు దళాలను కాల్చిచంపుతున్నాయి. అయితే అమిత్ షా చెప్పినట్టు మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమయ్యే పనేనా? ఈ ఏడాది భారీగా మరణాలు: నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోయారు. 24 ఏళ్ల క్రితం రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఒకే చర్యలో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించిన ఘటన ఇదే. కంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు 29 మంది నక్సలైట్లను హతమార్చిన ఐదు నెలలకే ఇది జరిగింది. 2024లో అక్టోబర్ 4వరకు ఒక్క ఛత్తీస్‌గఢ్‌లోనే 185మావోయిస్టులు మరణించారు. మరోవైపు జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది. ఇక ఈ నెల 7న ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద సమస్య ఉన్న పది రాష్ట్రాల సీఎంల కేంద్రం సమావేశం కానుంది. ఆపరేషన్ సమాధాన్ ఫెయిల్? నిజానికి 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ 'ఆపరేషన్ సమాధాన్' ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు. 2021 జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు. సమాధాన్ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు. అయితే ఈ టార్గెట్‌ను రీచ్ అవ్వలేదు. ఇక 2024 జనవరి నుంచి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల చంపడం ప్రారంభమైంది. ఇది 2026 మార్చి నాటికి పూర్తవుతుందని కేంద్రం చెబుతోంది. ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందా? ఛత్తీస్‌గఢ్‌లో విష్ణుసాయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందెన్నడూ లేని విధంగా దండకారణ్యాలు దద్దరిల్లుతున్నాయి. మావోయిస్టు ప్రభావం తక్కువ ఉన్న ప్రాంతాల్లోనూ ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. అటు పోలీసుల దెబ్బకు లొంగిపోతున్న మావోయిస్టుల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. ఇటు మావోయిస్టుల ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు క్యాంపుల సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటికే ఆయుధాల కోరతతో పాటు ప్రధాన లీడర్లను కోల్పోయి మావోయిస్టులు పోలీసుల ధాటికి విలవిలలాడుతున్నారు. వారి వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలో తెలియక ఖాకీల తుపాకీ తూటాలకు నేలకొరుగుతున్నారు. మావోయిస్టులు దేశద్రోహులా? అయితే పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మావోయిజాన్ని అంతం చేయడం సాధ్యంకాదంటున్నారు వామపక్షవాదులు. శతాబ్దాలుగా కడు దీనావస్థలో బతుకుతున్న ఆదివాసులను ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వాలు వాళ్లు ఆయుధాలు పట్టుకోని ఉద్యమిస్తే మాత్రం యుద్ధ ప్రాతిపదికన దిగి చంపుతుండడం దారుణమంటున్నారు. ఈ విధమైన నిర్మూలన కార్యక్రమాలు మొదలెట్టి రాజ్యాధికారం ద్వారా మరెంతమంది నిండు ప్రాణాలు బలితీసుకుంటారని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే కమ్యూనిస్టులు, మావోయిస్టులు దేశద్రోహులా? వారిని చంపడానికి ఏ చట్టాలు వర్తిస్తున్నాయని నిలదీస్తున్నారు. విముక్తి ఎప్పుడు? అటు మావోయిస్టులను అంతం చేయడానికిముందు దేశంలో ఏనాటి నుంచో తిష్ట వేసుకున్న దోపిడీ, పీడనల నుంచి దేశాన్ని విముక్తిచేయాలని వామపక్షవాదులు సవాల్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మావోయిస్టులతో పాటు అడవుల్లో ఉండే స్థానిక గిరిజనులు కూడా ఉంటున్నారన్నది ఆ సంస్థ ప్రధాన వాదన. అమాయక దళిత, గిరిజనల ప్రాణాలు తీసేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆ కులం వారి మలాన్ని శూద్రులు చేత్తో తీయలా? జైల్లలో ఇంత దారుణమా! #maoists మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి