'దళిత్ కిచెన్'లో రాహుల్ గాంధీ.. వంటచేసి, వారితోపాటే తిని.. మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ దళిత కుటుంబం ఇంటిని రాహుల్ గాంధీ సందర్శించారు. అజయ్ తుకారాం సనాదే ఆహ్వానం మేరకు వెళ్లిన రాహుల్ స్వయంగా కిచెన్‌లో వంట చేశారు. అనంతరం వారితో భోజనం చేశారు. అజయ్ రాసిన 'దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా' పుస్తకాన్ని పరిచయం చేశారు. By srinivas 07 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో స్వయంగా వంట చేసి, భోజనం చేశారు. మహారాష్ట్ర కొల్హాపూర్ లోని దళిత కుటుంబానికి చెందిన సాధారణ కార్యకర్త ఆహ్వానం మేరకు వారి ఇంటిని రాహుల్ గాంధీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అజయ్ తుకారాం సనాదే కుటుంబ సభ్యులతో కలిసి వారి వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. అనంతరం అజయ్ తుకారాం సనాదే రాసిన 'దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా' అనే పుస్తకాన్ని రాహుల్ గాంధీ పరిచయం చేశారు. दलित किचन के बारे में आज भी बहुत कम लोग जानते हैं। जैसा शाहू पटोले जी ने कहा, “दलित क्या खाते हैं, कोई नहीं जानता।”वो क्या खाते हैं, कैसे पकाते हैं, और इसका सामाजिक और राजनीतिक महत्व क्या है, इस जिज्ञासा के साथ, मैंने अजय तुकाराम सनदे जी और अंजना तुकाराम सनदे जी के साथ एक दोपहर… pic.twitter.com/yPjXUQt9te — Rahul Gandhi (@RahulGandhi) October 7, 2024 దళితులు ఏం తింటారో తెలియదు.. ఈ సందర్భంగా దళితుల వంటకాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రాహుల్ గాంధీ.. 'నేటికీ దళితుల వంటగది గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అజయ్ తుకారాం సనాదే అన్నట్లు.. దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదు. ఎలా వండుతారు, వారి తిండికి సంబంధించిన సామాజిక రాజకీయ ప్రాముఖ్యత ఏమిటి? అనే ఆసక్తితో నేను అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనదేతో ఒక మధ్యాహ్నం వారి ఇంట్లో గడిపాను. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న తన ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చారు' అని చెప్పారు. 'హర్భర్యాచి భాజీ.. అలాగే 'ఇద్దరం కలిసి శనగపప్పుతో చేసిన 'హర్భర్యాచి భాజీ' అనే కూర ఉడికించాం. వంకాయలతో తూర్ పప్పు తయారు చేశాం. రాజ్యాంగం బహుజనులకు కల్పించిన వాటాలు, హక్కులతో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం. అయితే ప్రతి భారతీయుడు తన హృదయంలో సోదర భావంతో కృషి చేసినప్పుడే సమాజంలో అందరినీ కలుపుకొని పోవడం, సమానత్వం సాధ్యమవుతాయి' అంటూ పోస్టులో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. చివరగా దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని సూచించారు. #rahul-gandhi #kitchen మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి