దళితుడి ఇంట్లో వంట చేసి భోజనం చేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ దళితుడి ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబంతో కలిసి వంట చేశారు. అనంతరం భోజనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

author-image
By srinivas
New Update

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ దళితుల ఇంట్లో స్వయంగా వంట చేసి, భోజనం చేశారు. మహారాష్ట్ర కొల్హాపూర్ లోని దళిత కుటుంబానికి చెందిన సాధారణ కార్యకర్త ఆహ్వానం మేరకు వారి ఇంటిని రాహుల్ గాంధీ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అజయ్ తుకారాం సనాదే కుటుంబ సభ్యులతో కలిసి వారి వంటగదిలో వివిధ వంటకాలు వండటం నేర్చుకున్నారు. అనంతరం అజయ్ తుకారాం సనాదే రాసిన 'దలిత్ కిచెన్ ఆఫ్ మరాఠ్వాడా' అనే పుస్తకాన్ని రాహుల్ గాంధీ పరిచయం చేశారు. 

దళితులు ఏం తింటారో తెలియదు..

ఈ సందర్భంగా దళితుల వంటకాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన రాహుల్ గాంధీ.. 'నేటికీ దళితుల వంటగది గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అజయ్ తుకారాం సనాదే అన్నట్లు.. దళితులు ఏం తింటారో ఎవరికీ తెలియదు. ఎలా వండుతారు, వారి తిండికి సంబంధించిన సామాజిక రాజకీయ ప్రాముఖ్యత ఏమిటి? అనే ఆసక్తితో నేను అజయ్ తుకారాం సనాదే, అంజనా తుకారాం సనదేతో ఒక మధ్యాహ్నం వారి ఇంట్లో గడిపాను. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న తన ఇంటికి నన్ను గౌరవంగా ఆహ్వానించి వంటగదిలో సహాయం చేసే అవకాశం ఇచ్చారు' అని చెప్పారు.  

'హర్భర్యాచి భాజీ..

అలాగే 'ఇద్దరం కలిసి శనగపప్పుతో చేసిన 'హర్భర్యాచి భాజీ' అనే కూర ఉడికించాం. వంకాయలతో తూర్ పప్పు తయారు చేశాం. రాజ్యాంగం బహుజనులకు కల్పించిన వాటాలు, హక్కులతో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం. అయితే ప్రతి భారతీయుడు తన హృదయంలో సోదర భావంతో కృషి చేసినప్పుడే సమాజంలో అందరినీ కలుపుకొని పోవడం, సమానత్వం సాధ్యమవుతాయి' అంటూ పోస్టులో రాహుల్ గాంధీ రాసుకొచ్చారు. చివరగా దళితుల సంస్కృతి, ఆచార సంప్రదాయాలు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉందని సూచించారు. 

#rahul-gandhi #launch #dalit-family
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe