Prof. Sai Baba: ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అరెస్టయిన ఆయన ఈ ఏడాది మార్చిలో విడుదలయ్యారు.

New Update
Sai baba

ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. గతంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయన్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు ఆయన నాగ్‌పూర్‌లో జైలు జీవితం గడిపారు. ఈ ఏడాది మార్చిలో జైలు నుంచి విడుదలయ్యారు. 

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో 2014లో ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టయ్యారు. 2017లో ఆయనకు గడ్చిరోలి సెషన్స్‌ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో ఆయన 10 ఏళ్ల పాటు నాగ్‌పూర్‌ జైల్లోనే గడపాల్సివచ్చింది. ఈ ఏడాది మార్చి 5న బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. మానవహక్కుల ఉద్యమ కారుడు, రచయిత, విద్యావేత్తగా సాయిబాబా గుర్తింపు పొందారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు