Lok Sabha: జమిలీ ఎన్నికల జేపీసీకి ఛైర్ పర్శన్ నియామకం జమిలీ ఎన్నికల పై అధ్యయనానికి ఏర్పాటైన జేపీసీకి ఛైర్మన్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని నియమించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు ఉద్దేశించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. By Manogna alamuru 20 Dec 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి గత కొన్నేళ్లుగా చర్చనీయాంశమవుతున్న జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంటులోకి వచ్చింది. ఇందుకోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు-2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2024ను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ రెండు బిల్లులకు 269 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేశారు. మరో 198 మంది ఎంపీలు ఈ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశారు. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారిగా ఎలక్ట్రానిక్ విధానంలో ఈ ఓటింగ్ నిర్వహించారు. దీని తరువాత ఈ రెండు బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)కి పంపాలని నిర్ణయించారు. ఛైర్మన్ నియామకం.. ఇప్పుడు ఈ జేపీసీకి ఛైర్మన్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నియమితులయ్యారు. ఈ విషయాన్ని రోజు లోక్‌సభ సెక్రటేరియట్ ప్రకటించింది. ఇందులో 39 మంది కమిటీ సభ్యులు ఉన్నారు. ముందు 31 మంది ఉంటారని చెప్పారు కానీ నిన్న దీని సంఖ్యను 39కు పెంచారు. దీని ప్రకారం కమిటీ సభ్యులుగా లోక్‌సభ నుంచి 27 మంది ఎంపీలు, రాజ్యసభ నుంచి 12 మంది చొప్పున ఉండనున్నారు . 2029లో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతానికి స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్రం పక్కన పెట్టింది. అయితే 2034 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జమిలి పరిధిలోకి రానున్నాయని అధికారక వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు జమిలి ఎన్నికలకు ఉన్న అడ్డంకులను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఇతర రాజకీయ పార్టీలను ఒప్పించి.. రాజ్యంగ సవరణలు జరిగేలా చూడడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.అలాగే జనాభా లెక్కల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజనను కూడా 2029లోపు పూర్తి చేయాలని మోదీ సర్కార్ భావిస్తోంది. Also Read: Pushpa-2: వందేళ్ళ బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన పుష్ప–2 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి