దేశంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుల జాబితాని ఇటీవల ఇండియా టూడే విడుదల చేసింది. ఇందులో ప్రధాన మంత్రి మోదీ టాప్ ప్లేస్‌లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రధాని వరుసగా మూడోసారి ఈ చోటు సంపాదించుకున్నారు.
ప్రధాని మంత్రి నరేంద్రమోదీ
నరేంద్రమోదీ ప్రధాన మంత్రిగా వరుసగా మూడు సార్లు గెలిచి రికార్డు సృష్టించారు. దేశ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేస్తూ తన మార్క్ చూపించుకున్నారు. బీజేపీ పార్టీని తిరుగులేని పార్టీగా నిలిచేలా చేయడంలో మోదీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పవచ్చు.
ఇది కూడా చూడండి: 10th విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇకపై!
మోహన్ మధుకర్ రావ్ భగవత్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కుటుంబం నుంచి వచ్చిన మోహన్ మధుకర్ రావ్ భగవత్.. దీనికి ప్రస్తుతం చీఫ్‌గా ఉన్నారు. ప్రధాని మోదీ తర్వాత ఇతను రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇది కూడా చూడండి: AP Rains: ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాల్లో వానలే..వానలు!
హోం మంత్రి అమిత్ షా
ప్రధాని మోదీకి పక్కనే ఉంటూ కేంద్రం తీసుకునే నిర్ణయాల్లో అమితా షా కూడా ముఖ్య పాత్ర పోషించారు.
ఇది కూడా చూడండి: Pawan Kalyan: పవన్ కు మరో కీలక బాధ్యత అప్పగించిన మోదీ!
రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ వరుసగా రెండుసార్లు ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాని రాహుల్ గాంధీ తిరిగి తీసుకొచ్చారు.
నారా చంద్రబాబు నాయుడు
అత్యంత శక్తిమంతుడు జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 5వ స్థానంలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమిని చూసిన ఏమాత్రం తగ్గకుండా ఈ ఎన్నికల్లో అధిక్యంలో గెలిచారు. రాజకీయంలో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు తన పాలనతో మార్క్ చూపిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Harish Rao: రేవంత్ కి త్వరలోనే 70MMలో సినిమా చూపిస్తాం..!