Kolkata: పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేశారు – సీబీఐ

ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో బెంగాల్ పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేశారని చెప్పింది సీబీఐ. దాంతో పాటూ ఘటన జరిగిన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించింది.

Kolkata doctor rape-murder case: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. చివరిసారి ఆమె డైరీలో రాసుకుంది ఇదే
New Update

Kolkata Trainee Doctor Case: దేశవ్యాప్తంగా కల్లోలం రేపింది ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో కీలక విషయాలు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి. తాజాగా ఈ హత్యాచార కేసులో పోలీసుల తీరుపై సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇందులో పోలీసులు నిందితుడికి హెల్ప్ చేశారని ఆరోపణలున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు సీబీఐ కూడా ఘటన తర్వాత నిందితుడికి సంబంధించిన వస్తువులను ఆలస్యంగా స్వాధీనం చేసుకుంది అని ఆరోపిస్తోంది. బెంగాల్ పోలీసులు కీలక ఆధారాలను నాశనం చేసే ఉద్దేశంతోనే విచారణ చేపట్టారని అంటోంది.

ట్రైనీ డాక్టర్ కేసును మొదట పోలీసులే టేకప్ చేశారు. అయితే వీరి మీద దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తం అవడంతో...సుప్రీంకోర్టు సబీఐను రంగంలోకి దించింది.వైద్యురాలిపై అఘాయిత్యం జరిగిన రెండు రోజుల తర్వాత నిందితుడు సంజయ్‌రాయ్‌ దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఒకవేళ వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని ఉంటే సాక్ష్యాధారాలు దొరికే అవకాశం ఉండేదని తెలిపింది. అలా చేసి ఉంటే కేసు ఇంత కాంప్లికేటెడ్ అయి ఉండేది కాదని చెబుతోంది.

ట్రైనీ డాక్టర్ రేప్, హత్య కేసు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. దీనికి సబంధించి జూనియర్ డాక్టర్లు నెల రోజులకు పైగా ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. తమకు భద్రత లేదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇందులో నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇతను కాక ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. అయితే ఇతను తమకు సపోర్ట్ చేయడం లేదని...అన్ని అబద్ధాలు చెబుతున్నాడని సీబీఐ ఆరోపిస్తోంది. పాలీగ్రాఫ్, వాయిస్ అనాలిసిస్ టెస్ట్‌లలో కూడా కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని చెప్పింది.

#kolkata-trainee-doctor-case
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe