Narendra Modi : డొనాల్డ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ!

గాజాలో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ కీలక పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

New Update
modi

గాజాలో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ కీలక పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చొరవతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన శాంతి ప్రణాళికలో భాగంగా ఇజ్రాయెల్ బందీల విడుదలను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు.

గాజా ప్రాంతంలో శాశ్వత శాంతి కోసం ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు భారత్ మద్దతు తెలుపుతుందని మోదీ స్పష్టం చేశారు. రెండు సంవత్సరాలకు పైగా బందీలుగా ఉన్న వారందరి విడుదలను మోదీ స్వాగతించారు. బందీల కుటుంబాల ధైర్యానికి, ట్రంప్ శాంతి ప్రయత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దృఢ సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు మోదీ. ట్రంప్ శాంతి ప్రణాళిక కింద సాధించిన పురోగతిపై మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

బలమైన నాయకత్వం ప్రతిబింబిస్తుంది

ఇది నెతన్యాహు  బలమైన నాయకత్వం ప్రతిబింబిస్తుందని మోదీ అన్నారు. ఈ ఒప్పందం ద్వారా బందీల విడుదలతో పాటు, గాజా ప్రజలకు మానవతా సహాయం మెరుగుపడుతుందని, ప్రాంతంలో శాశ్వత శాంతికి మార్గం సుగమం అవుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.  2023 అక్టోబరు 7న హమాస్ దక్షిణ ఇజ్రాయెల్‌పై చేసిన ముట్టడి తర్వాత ఈ సంఘర్షణ మొదలైంది. ఆ రోజు జరిగిన దాడిలో ఎక్కువగా పౌరులతో సహా 1,219 మంది మరణించగా, హమాస్ మిలిటెంట్లు 251 మందిని బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ చివరి బందీల విడుదలతో, గత ఏడాది కాలంగా కొనసాగుతున్న గాజా సంఘర్షణ ఒక ముగింపునకు చేరుకోవచ్చని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు