/rtv/media/media_files/kYbEOJwUfAMlY39nzQXF.jpg)
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ ఓ ఆసక్తికర వీడియోను దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లో అధికారిక నివాసం ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఓ ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు నామకరణం చేసిన మోదీ.. సోషల్ మీడియా వేదికగా ఈ శుభసందర్భాన్ని అందరితో పంచుకున్నారు.
A new member at 7, Lok Kalyan Marg!
— Narendra Modi (@narendramodi) September 14, 2024
Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4
ఈ మేరకు లేగదూడ నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తు ఉండటం విశేషం. కాగా ఈ విశిష్ట లక్షణాన్ని పురస్కరించుకుని దానికి ‘దీప్‌జ్యోతి’ (Deepjyoti) అని పేరు పెట్టారు మోదీ. అంతేకాదు ఆ లేగదూడకు శాలువా కప్పి ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలో నెట్టింట వైరల్ అవుతుండగా.. లేగదూడను ముద్దాడుతూ ముచ్చటగా కనిపించారు ప్రధాని.
हमारे शास्त्रों में कहा गया है - गाव: सर्वसुख प्रदा:'।
— Narendra Modi (@narendramodi) September 14, 2024
लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है।
प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है।
इसलिए, मैंने इसका नाम 'दीपज्योति'… pic.twitter.com/NhAJ4DDq8K