Marriage : ప్రేమ పెళ్లి చేసుకుంటున్నారా? అయితే ముందు మీ పేరెంట్స్‌కు మెసేజ్ వెళ్తుంది!

గుజరాత్ ప్రభుత్వం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై ఎవరైనా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల ప్రమేయం ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు తెస్తోంది.

New Update
Marriage

Marriage: గుజరాత్ ప్రభుత్వం పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై ఎవరైనా పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే తల్లిదండ్రుల ప్రమేయం ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు తెస్తోంది. దీనివల్ల ఇకపై దొంగచాటుగా పెళ్లిళ్లు చేసుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. ప్రభుత్వం తెస్తున్న కొత్త ప్రతిపాదన ప్రకారం.. వధూవరులు పెళ్లికి అప్లై చేసేటప్పుడు మా పెళ్లి విషయం మా పేరెంట్స్‌కు తెలుసు అని సంతకం పెట్టాలి. అంతేకాదు, మీరు అప్లై చేసిన పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మీ అమ్మనాన్నల ఫోన్లకు వాట్సాప్ మెసేజ్‌లు, ఎస్సెమ్మెస్‌లు వెళ్తాయి. మీ పెళ్లి పత్రిక, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కూడా అడుగుతారు.

Also Read: హైదరాబాద్ లో హైటెన్షన్...  రాంచందర్‌రావు అరెస్ట్!

30 రోజులు ఆగాల్సిందే!

ఇప్పటివరకు అప్లై చేయగానే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చేసేది. కానీ ఇకపై అలా కుదరదు. అప్లై చేసిన తర్వాత 30 రోజులు ఆగాలి. ఈ గ్యాప్‌లో మీ పెళ్లి ఫోటోలు, సాక్షుల వివరాలన్నీ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో పెడతారు. అంటే, ఎవరైనా సరే ఆన్‌లైన్‌లో చెక్ చేసుకునేలా అంతా పారదర్శకంగా మార్చేస్తున్నారు. తల్లిదండ్రుల మనోభావాలను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాం. పిల్లలు పెళ్లి చేసుకోగానే వెంటనే వాళ్ల పేరెంట్స్‌కు మెసేజ్ వెళ్లేలా ఒక పోర్టల్ రెడీ చేస్తున్నాం అని గుజరాత్ డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి చెప్పారు.

Also Read: శరద్ పవార్‌కు మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు దీనిని స్వాగతిస్తుంటే.. యువత మాత్రం ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారిని ఈ నిబంధన ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు ఆధారంగా తుది చట్టం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు