భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ, ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణను ఉల్లంఘించింది. మరోసారి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్ము కశ్మీర్ LOC, IB వెంట పాక్ కాల్పులకు పాల్పడింది. దీనికి ధీటుగా భారత బలగాలు బదులిస్తున్నాయి. బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా.. భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది.
#BREAKING: Reports of Ceasefire Violations by Pakistan Army and Rangers across LoC and IB in several sectors of Jammu & Kashmir in India. Forces responding strongly.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 11, 2025
శనివారం రోజు రాత్రి కూడా పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. జమ్మూలోని పలన్వాలా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి పాకిస్తాన్ శనివారం కాల్పులకు పాల్పడింది. అఖ్నూర్, రాజౌరి, ఆర్‌ఎస్ పురా సెక్టార్లలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైన్యం ఫిరంగి దాడులకు పాల్పడింది.
పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని ఇప్పటికే డిజిఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ గట్టిగా హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే... వెంటనే, బలమైన సమాధానం ఇవ్వాలని ఆర్మీ చీఫ్, కమాండర్లకు సూచించినట్లుగా ఆయన స్పష్టం చేశారు.