HDFC UPI Services:
ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్ యుగం. చేతిలో క్యాష్, కార్డుల వినియోగం బాగా తగ్గిపోయింది. అన్నీ యూపీఐ ద్వారా చెల్లింపులే జరుగుతున్నాయి. చిన్న చిన్న దుకాణాల నుంచి పెద్ద సంస్థల వరకూ యూపీఐ పేమెంట్స్ ను యాక్సెప్ట్ చేస్తున్నారు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది. దీంతో అందరూ ఈ డిజిటల్ చెల్లింపులకు అలవాటు పడ్డారు. కానీ ఇపుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టర్లకు షాక్ ఇచ్చింది. రెండు రోజుల పాటూ తమ బ్యాకం యూపీఐ సేవలను నిలివేస్తున్నట్టు ప్రకటించింది.
రాబోయే రెండు రోజులు హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండు రోజుల పాటు యూపీఐ పని చేయదు. దీనికి సబంధించిన సమాచారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ బ్యాంకు ఖాతాదారులు నవంబర్ 5, 23 తేదీల్లో సిస్టమ్ నిర్వహణ కోసం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవ తాత్కాలికంగా అందుబాటులో ఉండదని తెలిపింది. బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ సేవలు నవంబర్ 5న 2 గంటలు, నవంబర్ 23న 3 గంటల పాటు అందుబాటులో ఉండవు. బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి.. అవసరమైన సిస్టమ్ నిర్వహణను నిర్వహిస్తున్నామని బ్యాంక్ తెలిపింది.
Also Read: USA: అమెరికాలో ఎన్నికల హాడావుడి..ఇండియన్స్ ఓటు ఎవరికి?